Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్‌

సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘సైంధవ్‌’ ఒకటి. ఇందులో కథానాయికగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ గురించి పలు ఆసక్తికర విశేషాలివీ..

Updated : 12 Jan 2024 20:54 IST
1/10
వెంకటేశ్‌ 75వ చిత్రం ‘సైంధవ్‌’. ఆయన సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. సినిమా విడుదల తేదీ: జనవరి 13.

2/10
మనోజ్ఞగా కనిపించనుంది. ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు.

3/10
‘జెర్సీ’తో తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంది. ‘జోడి’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’లోనూ సందడి చేసింది.

4/10
మూడేళ్ల అనంతరం ‘సైంధవ్‌’తో మరోసారి తెలుగు వారికి హాయ్‌ చెప్పనుంది. ప్రస్తుతం.. కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

5/10
జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో జన్మించింది. తండ్రి ఆర్మీలో పనిచేయడంతో చాలా రాష్ట్రాల్లో పెరిగింది. 7-10 వరకు సికింద్రాబాద్‌లో చదువుకుంది.

6/10
బెంగళూరులో ఎల్‌ఎల్‌బీ చదివింది. కార్పొరేట్‌ లాయరుగా పనిచేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ రంగంలోనే స్థిరపడాలనుకుంది.

7/10
లాయర్‌గా పని చేస్తూనే పలు వేదికలపై నాటకాలు ప్రదర్శించేది. అలా ప్రకటనల్లో నటించే అవకాశాలు అందుకుంది. మలయాళ సినిమా ‘కోహినూర్‌’తో హీరోయిన్‌గా మారింది.

8/10
తీరిక వేళల్లో.. చెన్నైలో తమకున్న వ్యాపారాలు చూసుకుంటుంది. విహార యాత్రలు చేస్తుంటుంది.

9/10
అభిమాన నటులు: హృతిక్‌ రోషన్, సల్మాన్‌ ఖాన్‌, మమ్ముట్టి. మణిరత్నం- ఏఆర్‌ రెహమాన్‌ కాంబినేషన్‌లో పని చేయాలనుందట.

10/10
‘కెరీర్‌ ప్రారంభంలోనే (జెర్సీ సినిమా విషయంలో) తల్లిగా నటించడం అవసరమా?’ అని చాలామంది అన్నారట. కథ నచ్చడంతో వెనకడుగు వేయలేదని ఓ సందర్భంలో చెప్పింది. ‘సైంధవ్‌’లోనూ మదర్‌ క్యారెక్టర్‌ ప్లే చేసింది.

మరిన్ని