Shruti Haasan: శ్రుతిహాసన్‌.. ‘ఆద్య’గా అలరించేందుకు..

శ్రుతిహాసన్‌ (Shruti Haasan).. సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరంలేని పేరు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనదైన దారిలో ప్రయాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘సలార్‌’ (Salaar) డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు చూద్దాం..

Updated : 21 Dec 2023 22:17 IST
1/10
ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘సలార్’లో ఆద్యగా కనిపించనున్నారు. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘సలార్’లో ఆద్యగా కనిపించనున్నారు.
2/10
ఎప్పుడూ ప్రశాంతంగా, ఎంతో ఓపికతో ఉండే అమ్మాయిగా నటించారు. కథలో ఈ పాత్ర కీలకమైంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ఎంతో ఓపికతో ఉండే అమ్మాయిగా నటించారు. కథలో ఈ పాత్ర కీలకమైంది.
3/10
‘సలార్‌’ ప్రయాణంలో ప్రభాస్‌ స్నేహితుడయ్యారని తెలిపారు. తాను ఏం చెప్పినా ప్రభాస్‌ ఓపిగ్గా వినేవారట. ‘సలార్‌’ ప్రయాణంలో ప్రభాస్‌ స్నేహితుడయ్యారని తెలిపారు. తాను ఏం చెప్పినా ప్రభాస్‌ ఓపిగ్గా వినేవారట.
4/10
ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెడుతూ ఎనర్జీ తీసుకొచ్చేవారని, అందరినీ ఆనందంగా ఉండేలా చేసేవారని.. అదే ఇద్దరిలో కామన్‌ పాయింట్‌ అని శ్రుతి చెప్పారు. ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెడుతూ ఎనర్జీ తీసుకొచ్చేవారని, అందరినీ ఆనందంగా ఉండేలా చేసేవారని.. అదే ఇద్దరిలో కామన్‌ పాయింట్‌ అని శ్రుతి చెప్పారు.
5/10
ఇటీవల.. ‘హాయ్‌ నాన్న’లోని పార్టీ సాంగ్‌తో హుషారెత్తించారు. ఆ పాటను ఆమె ఆలపించడం విశేషం. నాని హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ఇటీవల.. ‘హాయ్‌ నాన్న’లోని పార్టీ సాంగ్‌తో హుషారెత్తించారు. ఆ పాటను ఆమె ఆలపించడం విశేషం. నాని హీరోగా తెరకెక్కిన సినిమా ఇది.
6/10
2023 సంక్రాంతికి రెండు విజయాలు అందుకున్నారు. అవే.. ‘వాల్తేరు వీరయ్య’ (చిరంజీవి), ‘వీరసింహారెడ్డి’ (బాలకృష్ణ). 2023 సంక్రాంతికి రెండు విజయాలు అందుకున్నారు. అవే.. ‘వాల్తేరు వీరయ్య’ (చిరంజీవి), ‘వీరసింహారెడ్డి’ (బాలకృష్ణ).
7/10
అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. విభిన్న ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. విభిన్న ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది.
8/10
ఈ హీరోయిన్‌ నటించిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ హీరోయిన్‌ నటించిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’ విడుదలకు సిద్ధంగా ఉంది.
9/10
చిన్నప్పుడు సేల్స్‌ గర్ల్‌ అవ్వాలనుకున్నారట. ఈ బ్యూటీకీ టాటూలంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు సేల్స్‌ గర్ల్‌ అవ్వాలనుకున్నారట. ఈ బ్యూటీకీ టాటూలంటే బాగా ఇష్టం.
10/10
కొందరు పెళ్లి గురించి ప్రస్తావిస్తూ వయసు దాటిపోయిందని అంటున్నారని, దాంతో ఒత్తిడికి గురవుతున్నానని ఓ సందర్భంలో చెప్పారు. కొందరు పెళ్లి గురించి ప్రస్తావిస్తూ వయసు దాటిపోయిందని అంటున్నారని, దాంతో ఒత్తిడికి గురవుతున్నానని ఓ సందర్భంలో చెప్పారు.

మరిన్ని