Payal Rajput: జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్‌

‘మంగళవారం’ సినిమాతో థ్రిల్‌ పంచిన పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ఇప్పుడు ‘రక్షణ’ (Rakshana)తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె నటించిన ఆ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పాయల్‌ గురించి కొన్ని విశేషాలు చూద్దాం..

Updated : 06 Jun 2024 20:32 IST
1/12
దిల్లీలో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీకి బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి. జర్నలిజంలో డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలంపాటు యాంకరింగ్‌ చేసింది.

2/12
కుటుంబ ప్రోత్సాహంతో సీరియల్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

3/12
2010 నుంచి దాదాపు ఏడేళ్లపాటు.. ‘యే హై ఆషికీ’, ‘కౌన్‌ హై?’ వంటి ధారావాహికల్లో నటించి, బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

4/12
పంజాబీ చిత్రం ‘ఛన్నా మేరేయా’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులోని ఆమె నటనకు ఫిదా అయిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఛాన్స్‌ ఇచ్చారు.

5/12
ఆ రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఇందు పాత్రలో ఒదిగిపోయింది. ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది.

6/12
‘ఆర్‌ఎక్స్‌ 100’ సక్సెస్‌తో.. వెంకటేశ్‌, రవితేజ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి, ఆకట్టుకుంది.

7/12
తమిళం, పంజాబీలో వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఆమె అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. టాలీవుడ్‌లోనూ కొన్నాళ్లు ఆ పరిస్థితి ఎదుర్కొంది.

8/12
గతేడాది విడుదలైన ‘మంగళవారం’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తనకు తొలి హిట్‌ ఇచ్చిన అజయ్‌ భూపతే ఈ సినిమాకి దర్శకుడు.

9/12
ఆ సినిమాలోని నటనకుగానూ 16వ ‘జైపుర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డును పాయల్‌ సొంతం చేసుకుంది.

10/12
దర్శకుడు ప్రణదీప్‌ ఠాకూర్‌ తెరకెక్కించిన ‘రక్షణ’లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. మరికొన్ని చిత్రాలతో పాయల్‌ బిజీగా ఉంది.

11/12
తన స్నేహితుడు సౌరభ్‌తో కలిసి దిగిన ఫొటోలను పలు సందర్భాల్లో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అతడితో ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది.

12/12
‘‘లాక్‌డౌన్‌ సమయంలో.. నాకు బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయా. జీవితం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది’’ అంటూ ఓ సందర్భంలో భావోద్వేగానికి గురైంది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు