Janhvi kapoor: జాన్వీకపూర్‌ లేటెస్ట్‌ స్టిల్స్‌.. ఆసక్తికర విషయాలు..

జాన్వీ కపూర్‌ (Janhvi kapoor)... శ్రీదేవి ముద్దుల తనయగా కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడిప్పుడే తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. సినిమాల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్‌ని సెట్‌ చేసుకుంటోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ జోరు చూపిస్తోంది జాన్వీ. ఆమె గ్లామరస్‌ ఫొటోలు, హాట్‌ పోజులతో కుర్రకారు మతులు కంట్రోల్‌ తప్పుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో నటిస్తోంది.

Updated : 30 Jan 2024 15:49 IST
1/22
‘ధడక్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన జాన్వీ.. ఇప్పటివరకూ ఏడు చిత్రాల్లో నటించింది.

2/22
ప్రస్తుతం ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’తో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

3/22
‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’, ‘ఉలాజ్‌’చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవి సెట్స్‌పై ఉన్నాయి.

4/22
సమయం దొరికితే జిమ్‌లో వ్యాయామాలు చేస్తా. కంటినిండా నిద్రపోతా. అందం మీద దృష్టి పెడతా. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్స్‌ గమనిస్తా.

5/22
నేను మంచి యాక్టర్ని అవ్వాలనీ, దర్శకురాలు గౌరీ షిండే దర్శకత్వంలో నటించాలనీ అమ్మ కోరుకుంది. అవి తీరకుండానే దూరమైంది. ఇప్పుడు ఆ రెండు కోరికలు తీర్చడానికి నేనెంతగానో కష్టపడుతున్నా. అమ్మ అంతటి దాన్ని కాకపోయినా ఆమె వారసురాల్ని అనిపించుకుంటే చాలు. 

6/22
‘గుంజన్‌ సక్సేనా’లో ఫైటర్‌ పైలట్‌గా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా. ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల వద్ద కొంత కాలం శిక్షణ తీసుకున్నా.

7/22
కాలుష్యం, హారన్లూ ఎంతో విసుగును తెప్పిస్తాయి. వాటికి దూరంగా ప్రకృతిలో గడపాలని చూస్తుంటా. ప్రశాంతతకోసం మూడు నెలలకోసారైనా తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తుంటా.

8/22
‘గుంజన్‌ సక్సేనా’లో ఫైటర్‌ పైలట్‌గా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా. ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల వద్ద కొంత కాలం శిక్షణ తీసుకున్నా.
‘గుంజన్‌ సక్సేనా’లో ఫైటర్‌ పైలట్‌గా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా. ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల వద్ద కొంత కాలం శిక్షణ తీసుకున్నా.
9/22
హెలికాప్టర్‌ నడపడం, దానిలోంచి కిందకు దిగడం... అమ్మో చాలా భయమేసింది. కానీ, అలాంటి సాహసాలు చేసినప్పుడే మనమేంటో  మనకు తెలుస్తుంది.

10/22
అమ్మ  లేదనే విషయం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నా. ఇప్పటికీ తనకోసం వెతుకుతూనే ఉంటా. అమ్మ రాసిన లేఖల్ని అప్పుడప్పుడూ చదువుకుంటా.

11/22
అమ్మ గుర్తుగా- ఓ లేఖలో రాసిన ‘ఐ లవ్యూ మై లబ్బూ’ అనే పదాలను చేతి మీద టాటూగా వేయించుకున్నా. దాన్ని చూస్తే అమ్మ నాతోనే ఉందనిపిస్తుంది.

12/22

పిజ్జాలు ఎంతిష్టమో. డైటింగ్‌లో ఉన్నా సరే వాటిని తినకుండా ఉండలేను. కాకపోతే పిజాలు తిన్న మర్నాడు ఎక్కువ సమయం వ్యాయామం చేస్తా.

13/22
అలానే నాకు స్ట్రీట్‌ ఫుడ్‌ బాగా నచ్చుతుంది. రెండు మూడు నెలలకోసారి ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ వాటినీ ఓ పట్టు పడుతుంటా.

14/22
నటి కాకపోయుంటే.. సంచార జీవితం చాలా ఇష్టం. నటిని కాకపోయుంటే కచ్చితంగా ప్రపంచాన్ని చుట్టేస్తూ... కొత్త వ్యక్తుల్ని కలుసుకునేదాన్ని. రచయిత్రిని అయ్యేదాన్ని.

15/22
నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలనుకుంటున్నా. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. తెలియని విషయాలు నేర్చుకుంటూ నాకూ ఏదో ఒకటి ఉత్సాహంగా నేర్పించాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. మా నాన్న కంటే ఎక్కువ ఎత్తు ఉండాలి.

16/22
కోల్డ్‌ స్టోరేజీలో చిక్కుకున్న అమ్మాయికి ఎదురైన సమస్యల ఆధారంగా తీసిన సినిమా ‘మిలి’. అందుకోసం -15 డిగ్రీల సెల్సియస్‌కు సెట్‌ చేసిన నిజమైన ఫ్రీజర్‌ బాక్సును తయారు చేయించారు. షూటింగ్‌ సమయంలో ఆ ఫ్రీజర్‌బాక్సులోనే ఉండాల్సి వచ్చేది. దాంతో ఆరోగ్యం దెబ్బతింది. ఇంటికెళ్లినా ఫ్రీజర్‌లో ఉన్నట్టే అనిపించేది. ఆ షూట్‌ జీవితంలో మర్చిపోలేను.

17/22
బెంజ్‌ కారు నా ఫేవరెట్‌. నా దగ్గరున్న ఐదారు కార్లలో రెండు బెంజ్‌లే. అంతేకాదు, మార్కెట్‌లోకి వచ్చే కొత్త మోడల్‌ కార్లను కొని వాటిలో తిరగడం  నాకో సరదా.

18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని