Keerthy Suresh: కీర్తి సురేశ్‌

‘భోళాశంకర్‌’ (Bholaa Shankar) చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమైంది కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కీర్తి గురించి కొన్ని విశేషాలు..

Updated : 10 Aug 2023 15:47 IST
1/16
మలయాళీ ఫిల్మ్‌ మేకర్‌ సురేశ్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళీ ఫిల్మ్‌ మేకర్‌ సురేశ్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2/16
1992 అక్టోబర్‌ 17న ఆమె చెన్నైలో జన్మించింది. విద్యను అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించింది. 1992 అక్టోబర్‌ 17న ఆమె చెన్నైలో జన్మించింది. విద్యను అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించింది.
3/16
ఆమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం ‘పైలెట్స్‌’.  ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో బాలనటిగా మెప్పించింది. ఆమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం ‘పైలెట్స్‌’. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో బాలనటిగా మెప్పించింది.
4/16
ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం ‘మాయ’.  కోలీవుడ్‌లో ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ‘మాయ’ అనంతరం కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం ‘నేను శైలజ’. ఇందులో ఆమె పాత్రకు యువత బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం ‘మాయ’. కోలీవుడ్‌లో ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ‘మాయ’ అనంతరం కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం ‘నేను శైలజ’. ఇందులో ఆమె పాత్రకు యువత బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు.
5/16
కీర్తి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మహానటి’.  అలనాటి నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికిగాను కీర్తికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. కీర్తి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికిగాను కీర్తికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.
6/16
తమిళంలో విజయం అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ రూపొందింది. ఇందులో చిరంజీవి సోదరి మహాలక్ష్మిగా కీర్తి నటించింది. తమిళంలో విజయం అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ రూపొందింది. ఇందులో చిరంజీవి సోదరి మహాలక్ష్మిగా కీర్తి నటించింది.
7/16
గతంలో.. ‘అణ్ణాత్తే’ (తెలుగులో పెద్దన్న)లోనూ కీర్తి సురేశ్‌ హీరో చెల్లెలిగా కనిపించింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది.  హీరో సిస్టర్‌ రోల్‌ కాబట్టి డ్యాన్స్‌ చేసే అవకాశం ఉంటుందో, లేదోనని అనుకుందట కీర్తి. ఆమె కోరుకున్నట్లుగానే ‘భోళాశంకర్‌’లో చిరుతో కలిసి స్టెప్పులేసే ఛాన్స్‌ వచ్చింది. రెండు పాటలకు  వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేశారు. గతంలో.. ‘అణ్ణాత్తే’ (తెలుగులో పెద్దన్న)లోనూ కీర్తి సురేశ్‌ హీరో చెల్లెలిగా కనిపించింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. హీరో సిస్టర్‌ రోల్‌ కాబట్టి డ్యాన్స్‌ చేసే అవకాశం ఉంటుందో, లేదోనని అనుకుందట కీర్తి. ఆమె కోరుకున్నట్లుగానే ‘భోళాశంకర్‌’లో చిరుతో కలిసి స్టెప్పులేసే ఛాన్స్‌ వచ్చింది. రెండు పాటలకు వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేశారు.
8/16
ఈ సినిమాలో  చిరంజీవి చెల్లిగా నటించినా సెట్లో ఆయన్ను చిరు గారు అనే పిలిచేది కీర్తి.  ఈమె తల్లి మేనక ‘పున్నమినాగు’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించారు.  దాంతో, ‘ మీ అమ్మ అమాయకురాలు. నువ్వు  మాత్రం స్వీటు నాటు’ అంటూ కీర్తిని ఆటపట్టించేవారట చిరు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించినా సెట్లో ఆయన్ను చిరు గారు అనే పిలిచేది కీర్తి. ఈమె తల్లి మేనక ‘పున్నమినాగు’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించారు. దాంతో, ‘ మీ అమ్మ అమాయకురాలు. నువ్వు మాత్రం స్వీటు నాటు’ అంటూ కీర్తిని ఆటపట్టించేవారట చిరు.
9/16
‘‘నాకు స్నేహితులెక్కువ. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో గడిపేందుకు ఇష్టపడతా. నాకు బ్రదర్‌ లాంటి ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో చిరంజీవి చేరారు’’ అని ఓ సందర్భంలో తెలిపింది కీర్తి. ‘‘నాకు స్నేహితులెక్కువ. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో గడిపేందుకు ఇష్టపడతా. నాకు బ్రదర్‌ లాంటి ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో చిరంజీవి చేరారు’’ అని ఓ సందర్భంలో తెలిపింది కీర్తి.
10/16
ఓవైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నాయిక ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఓవైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నాయిక ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
11/16
గతేడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన కీర్తి ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’, ‘మామన్నన్‌’ (నాయకుడు) చిత్రాలతో వచ్చి, విజయం అందుకుంది. గతేడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన కీర్తి ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’, ‘మామన్నన్‌’ (నాయకుడు) చిత్రాలతో వచ్చి, విజయం అందుకుంది.
12/16
కోలీవుడ్‌లో ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది.
13/16
14/16
15/16
16/16

మరిన్ని