Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌

‘హాయ్‌ నాన్న’ (Hi Nanna)తో తెలుగు ప్రేక్షకులకు మరోసారి హాయ్‌ చెప్పబోతున్నారు మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). నాని (Nani) సరసన ఆమె నటించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మృణాల్‌ గురించి పలు విశేషాలు మీకోసం..

Updated : 05 Dec 2023 17:52 IST
1/12
‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అందులో సీత పాత్రలో నటించి తొలి ప్రయత్నంలోనే విశేషంగా ఆకట్టుకున్నారు. ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అందులో సీత పాత్రలో నటించి తొలి ప్రయత్నంలోనే విశేషంగా ఆకట్టుకున్నారు.
2/12
మృణాల్‌ నటించిన రెండో తెలుగు సినిమా ‘హాయ్‌ నాన్న’. మూడో సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేస్తున్నారు. మృణాల్‌ నటించిన రెండో తెలుగు సినిమా ‘హాయ్‌ నాన్న’. మూడో సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేస్తున్నారు.
3/12
ఈ గ్యాప్‌లో పలు హిందీ సినిమాలతో అలరించారు. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’, ‘పిప్పా’ తదితర ప్రాజెక్టుల్లో విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఈ గ్యాప్‌లో పలు హిందీ సినిమాలతో అలరించారు. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’, ‘పిప్పా’ తదితర ప్రాజెక్టుల్లో విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.
4/12
మహారాష్ట్రకు చెందిన మృణాల్‌ మీడియాపై ఉన్న ఆసక్తితో బ్యాచిలర్స్‌ ఇన్‌ మాస్‌ మీడియా (బీఎమ్‌ఎమ్‌) కోర్సులో చేరారు. కానీ, కొన్ని నెలలకు తనకు ఆ రంగం కరెక్ట్‌కాదని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రకు చెందిన మృణాల్‌ మీడియాపై ఉన్న ఆసక్తితో బ్యాచిలర్స్‌ ఇన్‌ మాస్‌ మీడియా (బీఎమ్‌ఎమ్‌) కోర్సులో చేరారు. కానీ, కొన్ని నెలలకు తనకు ఆ రంగం కరెక్ట్‌కాదని నిర్ణయించుకున్నారు.
5/12
ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిన మృణాల్‌కు ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందట. అలా చేస్తే అమ్మానాన్నలు తట్టుకోలేరని క్రమంగా సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్‌ అయ్యారు. ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిన మృణాల్‌కు ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందట. అలా చేస్తే అమ్మానాన్నలు తట్టుకోలేరని క్రమంగా సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్‌ అయ్యారు.
6/12
చదువుకుంటూనే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టారు. ఓ షోలో ఆమెను చూసిన ఓ దర్శకుడు 2012లో ‘ముఝే కుఛ్‌ కెహ్‌తీ హై ఖామోషియా’ అనే సీరియల్‌లో అవకాశమిచ్చారు. తర్వాత, మరికొన్ని ధారావాహికల్లో నటించారు. చదువుకుంటూనే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టారు. ఓ షోలో ఆమెను చూసిన ఓ దర్శకుడు 2012లో ‘ముఝే కుఛ్‌ కెహ్‌తీ హై ఖామోషియా’ అనే సీరియల్‌లో అవకాశమిచ్చారు. తర్వాత, మరికొన్ని ధారావాహికల్లో నటించారు.
7/12
ఎన్నో ప్రయత్నాల అనంతరం వెండితెరపై మెరిసే అవకాశం అందుకున్నారు. ‘సుల్తాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి మృణాల్‌ నటించాల్సిందిగానీ ఛాన్స్‌ మిస్‌ అయింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం వెండితెరపై మెరిసే అవకాశం అందుకున్నారు. ‘సుల్తాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి మృణాల్‌ నటించాల్సిందిగానీ ఛాన్స్‌ మిస్‌ అయింది.
8/12
బాధపడుకుండా రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ఆడిషన్స్‌ ఇస్తూ ఉండేవారు. బాధపడుకుండా రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ఆడిషన్స్‌ ఇస్తూ ఉండేవారు.
9/12
అలా 2014లో ‘హలో నందన్‌’ (మరాఠీ) చిత్రంతో హీరోయిన్‌గా మారారు. ఈమె నటించిన మరో రెండు సినిమాలు అదే ఏడాది విడుదలకావడం విశేషం. అలా 2014లో ‘హలో నందన్‌’ (మరాఠీ) చిత్రంతో హీరోయిన్‌గా మారారు. ఈమె నటించిన మరో రెండు సినిమాలు అదే ఏడాది విడుదలకావడం విశేషం.
10/12
2018లో విడుదలైన ‘లవ్‌ సోనియా’ మృణాల్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకునేలా చేసింది. 2018లో విడుదలైన ‘లవ్‌ సోనియా’ మృణాల్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకునేలా చేసింది.
11/12
నటుడు కీను రీవ్స్‌ (కెనడా) అంటే తనకు అభిమానమని, అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఓ సందర్భంలో చెప్పారు. నటుడు కీను రీవ్స్‌ (కెనడా) అంటే తనకు అభిమానమని, అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఓ సందర్భంలో చెప్పారు.
12/12

మరిన్ని