News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(28-01-2023)

Updated : 28 Jan 2023 07:54 IST
1/12
రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి సప్త వాహన సేవలు నిర్వహించనున్నారు. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి సప్త వాహన సేవలు నిర్వహించనున్నారు. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.
2/12
కోనసీమ జిల్లా, గోదావరి నదీ పరివాహక ప్రాంతం.. సూర్యాస్తమయ సమయంలో అలసిన భానుడి సంధ్యాకిరణాలు గలగలా పారుతున్న గోదావరి జలంపై పడి సువర్ణంలా మెరుస్తూ అలలపై పడుతుండగా.. ఆవిష్కృతమైన సుందర దృశ్యమిది.

3/12
ఉడుపి జిల్లా కార్కళ సమీపంలోని బైలూరు ఉమికల్‌ బెట్టపై ఏర్పాటు చేసిన 33 అడుగుల ఎత్తైన పరశురాముని విగ్రహం ఉన్న థీమ్‌ పార్కును శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రారంభించారు

4/12
అల్లూరి సీతారామ రాజు జిల్లా ,రాజవొమ్మంగిలో 516-ఈ జాతీయ రహదారిని ఆనుకుని టెలిఫోన్‌ ఎక్స్ఛేంజి సమీపాన ఉన్న దేవగన్నేరు చెట్టు నిండుగా పూలతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ చెట్టుకు ఒక్క ఆకు లేకుండా అన్నీ పుష్పాలే ఉండటం విశేషం. అటుగా వెళ్లే ప్రయాణికులు ఆసక్తిగా దీన్ని తిలకిస్తున్నారు.

5/12
 విజయనగరం, బొబ్బిలి మండలంలోని దిబ్బగుడివలసలో రైతు రొంగలి సత్యనారాయణకు చెందిన ఓ మునగ చెట్టు అధికంగా కాయలు కాసింది. ఆకుల కంటే కాయలే ఎక్కువగా కాయడంతో అటువైపు వెళ్లిన వారంతా చూసి ముచ్చట పడి ఫొటోలు తీసుకుంటున్నారు.

6/12
 రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని కర్నూలు నగరంలోని సూర్యనారాయణస్వామి ఆలయం ముస్తాబైంది. శనివారం ఉదయం 5.30 గంటలకు ప్రత్యక్ష సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

7/12
  చిత్రం చూస్తే నీలాకాశం ఎరుపు వర్ణశోభితమై కిందికి దిగివచ్చినట్టు అనిపిస్తుంది కదూ. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం బాదనకుర్తి వంతెనపై గోదావరి చెంత శుక్రవారం సాయంత్రం ఈ సుందర దృశ్యం ఆకట్టుకుంది.

8/12
 హైదరాబాద్, మాదాపూర్‌లోని హైటెక్స్‌లో పెటెక్స్‌ ఇండియా-2023 ప్రదర్శన శుక్రవారం అబ్బురపర్చింది. అరుదైన విదేశీ, దేశీయ జాతుల శునకాలు, పిల్లులు, పక్షులు, చేపలు ఆకట్టుకున్నాయి.  వివిధ నగరాల నుంచి జంతుపోషకులు తరలివచ్చారు.

9/12
 హైదరాబాద్, బల్కంపేట లింగయ్యనగర్‌ బస్తీలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం పరిస్థితి. నీళ్లు కావాలంటే సంపులో దిగాల్సిందే.

10/12
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి జాతరలో గుడారాలు కాదు.. హైదరాబాద్, హయత్‌నగర్‌ పాపాయిగూడ 215-224 సర్వే నంబర్ల భూముల్లో నగరం సహా సమీప జిల్లాల నుంచి వేలాది మంది వచ్చి ఇలా ఆక్రమించారు. 

11/12
 భారత్‌కు చెందిన తల్లీ సుధా రవి, ఆమె కుమార్తె రక్షిత సింగపూర్‌లో 26 వేల ఐస్‌క్రీం పుల్లలతో రంగోలి కళాకృతి వేసి సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

12/12
రథసప్తమి సందర్భంగా శోభాయమానంగా తిరుమల శ్రీవారి ఆలయం రథసప్తమి సందర్భంగా శోభాయమానంగా తిరుమల శ్రీవారి ఆలయం

మరిన్ని