News in Pics: చిత్రం చెప్పే సంగతులు(1-02-2023)

Updated : 01 Feb 2023 12:18 IST
1/19
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఫోర్‌బే జలాశయ చెంత గట్టలపై నుంచి మంచు పొరలను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించిన దృశ్యమిది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఫోర్‌బే జలాశయ చెంత గట్టలపై నుంచి మంచు పొరలను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించిన దృశ్యమిది.
2/19
మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ శివారులో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్‌లో ఎడ్ల బండి, రైతు కుటుంబం ఆకృతి నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల మంత్రి హరీశ్‌ రావు ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. వ్యవసాయాన్ని ప్రతిబింబించే ఈ నిర్మాణం వద్ద కొందరు స్వీయచిత్రాలు దిగుతున్నారు. మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ శివారులో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్‌లో ఎడ్ల బండి, రైతు కుటుంబం ఆకృతి నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల మంత్రి హరీశ్‌ రావు ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. వ్యవసాయాన్ని ప్రతిబింబించే ఈ నిర్మాణం వద్ద కొందరు స్వీయచిత్రాలు దిగుతున్నారు.
3/19
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజక వర్గం జమ్మికుంట మండలంలో మంగళవారం జరిగిన భారాస బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. సభా ప్రాంగణంలో ఓ వృద్ధురాలు ఈల వేస్తూ నృత్యం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజక వర్గం జమ్మికుంట మండలంలో మంగళవారం జరిగిన భారాస బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. సభా ప్రాంగణంలో ఓ వృద్ధురాలు ఈల వేస్తూ నృత్యం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
4/19
కూరగాయలు, మిరప తోటను అడవి పందులు ధ్వంసం చేస్తుండటంతో ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండల  కేంద్రంలో దుంపెట రమేష్ 20 గుంటల విస్తీర్ణంలో మిరప, టమాట, వంకాయతోపాటు ఇతరత్రా కూరగాయలు సాగు చేస్తున్నారు. రాత్రివేళలో అడవి పందులు పంటను ధ్వంసం చేస్తుండడంతో మట్టి కుండలను తెల్లని రంగు వేసి కర్రలపై ఉంచారు. అవి తెల్లగా కనిపిస్తుండంతో పందులు రావడంలేదని రైతు రమేష్‌ పేర్కొన్నారు. కూరగాయలు, మిరప తోటను అడవి పందులు ధ్వంసం చేస్తుండటంతో ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండల కేంద్రంలో దుంపెట రమేష్ 20 గుంటల విస్తీర్ణంలో మిరప, టమాట, వంకాయతోపాటు ఇతరత్రా కూరగాయలు సాగు చేస్తున్నారు. రాత్రివేళలో అడవి పందులు పంటను ధ్వంసం చేస్తుండడంతో మట్టి కుండలను తెల్లని రంగు వేసి కర్రలపై ఉంచారు. అవి తెల్లగా కనిపిస్తుండంతో పందులు రావడంలేదని రైతు రమేష్‌ పేర్కొన్నారు.
5/19
నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లో ఉన్న స్టేట్‌ మ్యూజియానికి వివిధ ప్రదేశాల నుంచి సందర్శకులు నిత్యం వస్తుంటారు. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో నిర్వహణ లోపించింది. మ్యూజియం భవనంపై చెట్లు పెరుగుతున్నాయి. ఫిరంగులు తుప్పు పట్టిపోయాయి. అక్కడి చిన్న కొలనులో మురుగునీటితో దుర్వాసన వస్తోంది. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లో ఉన్న స్టేట్‌ మ్యూజియానికి వివిధ ప్రదేశాల నుంచి సందర్శకులు నిత్యం వస్తుంటారు. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో నిర్వహణ లోపించింది. మ్యూజియం భవనంపై చెట్లు పెరుగుతున్నాయి. ఫిరంగులు తుప్పు పట్టిపోయాయి. అక్కడి చిన్న కొలనులో మురుగునీటితో దుర్వాసన వస్తోంది.
6/19
ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. రోడ్ల పక్కన, డంపింగ్‌ యార్డుల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. మూగజీవులు ఆ సంచుల్లోని ఆహార పదార్థాలతో పాటు వాటినీ తింటూ అనారోగ్యం బారిన పడుతున్నాయి. హయాత్‌నగర్‌ డంపింగ్ యార్డులో, ఆటోనగర్‌ ఇసుకలారీల అడ్డా పరిసరాల్లో కనిపించిన దృశ్యాలివి. ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. రోడ్ల పక్కన, డంపింగ్‌ యార్డుల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. మూగజీవులు ఆ సంచుల్లోని ఆహార పదార్థాలతో పాటు వాటినీ తింటూ అనారోగ్యం బారిన పడుతున్నాయి. హయాత్‌నగర్‌ డంపింగ్ యార్డులో, ఆటోనగర్‌ ఇసుకలారీల అడ్డా పరిసరాల్లో కనిపించిన దృశ్యాలివి.
7/19
శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో అసెంబ్లీ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సమీపంలోని భారీ వృక్షాల చుట్టూ చిన్న పూల మొక్కలు ఏర్పాటు చేయడంతో ఆ దారికే కొత్తందం వచ్చింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో అసెంబ్లీ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సమీపంలోని భారీ వృక్షాల చుట్టూ చిన్న పూల మొక్కలు ఏర్పాటు చేయడంతో ఆ దారికే కొత్తందం వచ్చింది.
8/19
పటాన్‌చెరు బస్టాండు రోడ్డులో ఓ పెద్ద మర్రిచెట్టును పూర్తిగా కొట్టి వేయకుండా సంరక్షించడంతో చెట్టు మళ్లీ చిగురిస్తోంది. మండల పరిషత్‌ కార్యాలయంలో 50 సంవత్సరాల చెట్టు చుట్టూ కొంతమేరకు ప్లాస్టింగ్‌ చేసి చెట్టును పూర్తిగా కొట్టివేయకుండా కాపాడారు. ఈ రెండు వృక్షాలు 40, 50 ఏళ్ల నాటివి. వీటి సంరక్షణపై పర్యావరణం ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పటాన్‌చెరు బస్టాండు రోడ్డులో ఓ పెద్ద మర్రిచెట్టును పూర్తిగా కొట్టి వేయకుండా సంరక్షించడంతో చెట్టు మళ్లీ చిగురిస్తోంది. మండల పరిషత్‌ కార్యాలయంలో 50 సంవత్సరాల చెట్టు చుట్టూ కొంతమేరకు ప్లాస్టింగ్‌ చేసి చెట్టును పూర్తిగా కొట్టివేయకుండా కాపాడారు. ఈ రెండు వృక్షాలు 40, 50 ఏళ్ల నాటివి. వీటి సంరక్షణపై పర్యావరణం ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
9/19
గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ కళాశాలలో మంగళవారం ‘పాప్‌ కార్న్‌’ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా ఫొటోలు దిగుతున్న హీరో సాయిరోనక్‌, హీరోయిన్‌ అవికా గోర్‌ తదితరులు. గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ కళాశాలలో మంగళవారం ‘పాప్‌ కార్న్‌’ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా ఫొటోలు దిగుతున్న హీరో సాయిరోనక్‌, హీరోయిన్‌ అవికా గోర్‌ తదితరులు.
10/19
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం దక్షిణాది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌తో ఉపకులపతులు, అధికారులు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం దక్షిణాది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌తో ఉపకులపతులు, అధికారులు.
11/19
కడప-బెంగళూరు రైల్వే లైన్‌ పనులను రూ.1784.64 కోట్ల అంచనా వ్యయంతో సెప్టెంబరు 1, 2010న ప్రారంభించారు. అయిదేళ్లలో పనులు పూర్తి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పించారు. సుమారు రూ.217 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికి 12 సంవత్సరాలైంది. కొంతమేరకు వేసిన రైల్వే లైనుపై కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. కడప-బెంగళూరు రైల్వే లైన్‌ పనులను రూ.1784.64 కోట్ల అంచనా వ్యయంతో సెప్టెంబరు 1, 2010న ప్రారంభించారు. అయిదేళ్లలో పనులు పూర్తి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పించారు. సుమారు రూ.217 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికి 12 సంవత్సరాలైంది. కొంతమేరకు వేసిన రైల్వే లైనుపై కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది.
12/19
కడప జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామికి పుష్పయాగం నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామికి పుష్పయాగం నిర్వహించారు.
13/19
శ్రీనగర్‌ భవానీ ఆలయంలో రాహుల్‌, ప్రియాంక శ్రీనగర్‌ భవానీ ఆలయంలో రాహుల్‌, ప్రియాంక
14/19
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తోడ్కొని వెళ్తున్న ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తోడ్కొని వెళ్తున్న ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి.
15/19
మ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎండుమిర్చి పోటెత్తుతోంది. మంగళవారం సుమారు 60 వేల బస్తాల సరకు రావడంతో మార్కెట్‌ ఆవరణ పూర్తిగా నిండిపోయింది. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక నిల్వలు కావటం విశేషం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని వివిధ జిల్లాల రైతులు ఇక్కడ మిరప పంటను విక్రయిస్తారు.వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎండుమిర్చి పోటెత్తుతోంది. మంగళవారం సుమారు 60 వేల బస్తాల సరకు రావడంతో మార్కెట్‌ ఆవరణ పూర్తిగా నిండిపోయింది. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక నిల్వలు కావటం విశేషం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని వివిధ జిల్లాల రైతులు ఇక్కడ మిరప పంటను విక్రయిస్తారు.వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
16/19
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌- కర్ణప్రయాగ్‌ రైలు మార్గం కోసం సొరంగం తవ్వుతున్న కారణంగా రుద్రప్రయాగ్‌ జిల్లా మరోడా గ్రామంలో ఓ ఇంటికి ఏర్పడిన పగుళ్లు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌- కర్ణప్రయాగ్‌ రైలు మార్గం కోసం సొరంగం తవ్వుతున్న కారణంగా రుద్రప్రయాగ్‌ జిల్లా మరోడా గ్రామంలో ఓ ఇంటికి ఏర్పడిన పగుళ్లు.
17/19
అదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వారిని ఈ రెండు చెట్లు ఆకట్టుకుంటున్నాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో, మరొకటి పసుపు రంగులో పక్కపక్కనే ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో పచ్చరంగులో కుంకుడు చెట్టు ఉండగా.. మరొకటి ఫైకాస్‌ కొత్త చిగురు రావడంతో ఇలా పసుపు రంగులో మెరుస్తోంది. అదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వారిని ఈ రెండు చెట్లు ఆకట్టుకుంటున్నాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో, మరొకటి పసుపు రంగులో పక్కపక్కనే ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో పచ్చరంగులో కుంకుడు చెట్టు ఉండగా.. మరొకటి ఫైకాస్‌ కొత్త చిగురు రావడంతో ఇలా పసుపు రంగులో మెరుస్తోంది.
18/19
ఫార్ములా-ఈ రేస్‌ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా  సాగుతున్నాయి. సందర్శకులు కూర్చోడానికి కొత్త  సచివాలయం ముందు ఉన్న పార్కులో గ్యాలరీ నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా గ్యాలరీ నిర్మాణం కోసం ఉద్యానంలో ఉన్న చెట్లు కొట్టేశారు. వాటిపై బల్లలు ఏర్పాటు చేస్తున్నారు.
ఫార్ములా-ఈ రేస్‌ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సందర్శకులు కూర్చోడానికి కొత్త సచివాలయం ముందు ఉన్న పార్కులో గ్యాలరీ నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా గ్యాలరీ నిర్మాణం కోసం ఉద్యానంలో ఉన్న చెట్లు కొట్టేశారు. వాటిపై బల్లలు ఏర్పాటు చేస్తున్నారు.
19/19
 రెక్కలు లేని విమానం  మరమ్మతుల కోసం వేచి ఉందనుకుంటే పొరబడినట్లే. ఆకాశయానం నుంచి విరమణ తీసుకున్న విమానాన్ని హోటల్‌గా మార్చే పనులు తుది దశకు చేరుకున్నాయి. భాగ్యనగర శివారు శామీర్‌పేట్‌ అలియాబాద్‌లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. రెక్కలు లేని విమానం మరమ్మతుల కోసం వేచి ఉందనుకుంటే పొరబడినట్లే. ఆకాశయానం నుంచి విరమణ తీసుకున్న విమానాన్ని హోటల్‌గా మార్చే పనులు తుది దశకు చేరుకున్నాయి. భాగ్యనగర శివారు శామీర్‌పేట్‌ అలియాబాద్‌లో త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మరిన్ని