చిత్రం చెప్పే సంగతులు-02(21-01-2023)

Updated : 21 Jan 2023 22:23 IST
1/22
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
2/22
3/22
చొల్లంగి అమావాస్య తీర్థం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పలంకలోని బాలాత్రిపుర సుందరీ సమేత సంఘమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చొల్లంగి అమావాస్య తీర్థం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పలంకలోని బాలాత్రిపుర సుందరీ సమేత సంఘమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
4/22
వరంగల్ నిట్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటుడు సుహాస్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. వరంగల్ నిట్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటుడు సుహాస్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
5/22
ఉత్సవాల్లో భాగంగా గులకరాళ్లపై చిత్రాలను తీర్చిదిద్దిన నిట్‌ విద్యార్థులు ఉత్సవాల్లో భాగంగా గులకరాళ్లపై చిత్రాలను తీర్చిదిద్దిన నిట్‌ విద్యార్థులు
6/22
హనుమకొండలో ప్రముఖ నాట్య కళాకారిణి, విక్రమ్‌ సారాబాయి కుమార్తె మల్లికా సారాబాయి ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆసాంతం ఆకట్టుకుంది. హనుమకొండలో ప్రముఖ నాట్య కళాకారిణి, విక్రమ్‌ సారాబాయి కుమార్తె మల్లికా సారాబాయి ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆసాంతం ఆకట్టుకుంది.
7/22
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఓ స్కిన్‌ అండ్ హెయిర్‌ కేర్‌ సెంటర్‌ రెండో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి రాశీసింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఓ స్కిన్‌ అండ్ హెయిర్‌ కేర్‌ సెంటర్‌ రెండో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి రాశీసింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
8/22
మౌని అమావాస్య సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
9/22
త్రివేణి సంగమం వద్ద జన సందోహం త్రివేణి సంగమం వద్ద జన సందోహం
10/22
రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకు ముందు లక్ష్యఛేదనలో భాగంగా రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ బాలుడు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకువచ్చి హిట్‌మ్యాన్‌ను ఆలింగనం చేసుకున్నాడు. స్పందించిన భద్రతా సిబ్బంది బాలుడిని బయటకు పంపించారు. రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకు ముందు లక్ష్యఛేదనలో భాగంగా రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ బాలుడు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకువచ్చి హిట్‌మ్యాన్‌ను ఆలింగనం చేసుకున్నాడు. స్పందించిన భద్రతా సిబ్బంది బాలుడిని బయటకు పంపించారు.
11/22
బాలుడిని లాగుతున్న భద్రతా సిబ్బంది బాలుడిని లాగుతున్న భద్రతా సిబ్బంది
12/22
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు విజయవంతంగా పూర్తయిందని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది. ఫొటోలో మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఇతర ప్రతినిధులున్నారు. 4 రోజుల్లో 52 బిజినెస్‌ మీటింగ్స్‌, 6 రౌండ్‌ టేబుల్‌ మీటింగ్స్‌, రెండు ప్యానెల్‌ డిస్కషన్స్‌ జరిగినట్లు పోస్టులో పేర్కొంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు విజయవంతంగా పూర్తయిందని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది. ఫొటోలో మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఇతర ప్రతినిధులున్నారు. 4 రోజుల్లో 52 బిజినెస్‌ మీటింగ్స్‌, 6 రౌండ్‌ టేబుల్‌ మీటింగ్స్‌, రెండు ప్యానెల్‌ డిస్కషన్స్‌ జరిగినట్లు పోస్టులో పేర్కొంది.
13/22
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నాయకులు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు సమర్పించేందుకు శనివారం చాదర్‌ను పంపించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నాయకులు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు సమర్పించేందుకు శనివారం చాదర్‌ను పంపించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
14/22
విశాల్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్క్‌ ఆంటోని’. ఈ సినిమాలో సునీల్‌ నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం సంబంధిత పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంది. విశాల్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్క్‌ ఆంటోని’. ఈ సినిమాలో సునీల్‌ నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం సంబంధిత పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంది.
15/22
ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా దంపతులకు సమీప ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ దంపతులు కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట మౌనదీక్ష నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడంతో వారి పిల్లలు సైతం కంటతడి పెడుతూ కనిపించారు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా దంపతులకు సమీప ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ దంపతులు కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట మౌనదీక్ష నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడంతో వారి పిల్లలు సైతం కంటతడి పెడుతూ కనిపించారు.
16/22
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో జనవరి 27 నుంచి 29వరకు పెటెక్స్‌ ఇండియా ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో శునకాలు, మకావ్‌ పక్షులు, పిల్లులు తదితర పెంపుడు జంతువులకు పోటీలు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌కు పలువురు నగరవాసులు తమ పెంపుడు జంతువులతో వచ్చి సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో జనవరి 27 నుంచి 29వరకు పెటెక్స్‌ ఇండియా ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో శునకాలు, మకావ్‌ పక్షులు, పిల్లులు తదితర పెంపుడు జంతువులకు పోటీలు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌కు పలువురు నగరవాసులు తమ పెంపుడు జంతువులతో వచ్చి సందడి చేశారు.
17/22
పెంపుడు శునకాలతో వచ్చిన నగరవాసులు పెంపుడు శునకాలతో వచ్చిన నగరవాసులు
18/22
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ‘మైన్‌ అండ్‌ యువర్స్‌’ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి మంచు లక్ష్మి హాజరై అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలు, డిజైనర్‌ దుస్తులను పరిశీలించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ‘మైన్‌ అండ్‌ యువర్స్‌’ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి మంచు లక్ష్మి హాజరై అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలు, డిజైనర్‌ దుస్తులను పరిశీలించారు.
19/22
రాయ్‌పుర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్‌ గెలిచిన తర్వాత ఏదో మర్చిపోయినట్లు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తలపట్టుకున్నాడు. టాస్‌ విషయంలో ఎలా స్పందించాలనే విషయంపై జట్టు సభ్యులతో చాలా విధాలుగా చర్చించినట్లు.. అన్ని ఆలోచనలు కలిసి సందిగ్ధం ఏర్పడిందని ఆయన తర్వాత బదులిచ్చారు. (ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్‌ ఖాతా) రాయ్‌పుర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్‌ గెలిచిన తర్వాత ఏదో మర్చిపోయినట్లు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తలపట్టుకున్నాడు. టాస్‌ విషయంలో ఎలా స్పందించాలనే విషయంపై జట్టు సభ్యులతో చాలా విధాలుగా చర్చించినట్లు.. అన్ని ఆలోచనలు కలిసి సందిగ్ధం ఏర్పడిందని ఆయన తర్వాత బదులిచ్చారు. (ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్‌ ఖాతా)
20/22
సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. ఈ నెల 23న నిర్వహించనున్న సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మైఖేల్‌’ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. ఈ నెల 23న నిర్వహించనున్న సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మైఖేల్‌’ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
21/22
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం వరంగల్‌లోని నిట్‌ కళాశాలలో యూత్ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యూత్‌ రన్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం వరంగల్‌లోని నిట్‌ కళాశాలలో యూత్ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యూత్‌ రన్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
22/22
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని