చిత్రం చెప్పే సంగతులు-02(28-01-2023)

Updated : 28 Jan 2023 21:30 IST
1/20
కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
2/20
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘పెటెక్స్‌ ఇండియా’ ప్రదర్శనకు నగరవాసులు తమ పెంపుడు జంతువులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ యువతి తన పెంపుడు శునకాన్ని ముద్దు చేస్తూ కనిపించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘పెటెక్స్‌ ఇండియా’ ప్రదర్శనకు నగరవాసులు తమ పెంపుడు జంతువులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ యువతి తన పెంపుడు శునకాన్ని ముద్దు చేస్తూ కనిపించింది.
3/20
పెటెక్స్‌ ఇండియా ప్రదర్శనకు వచ్చిన ఓ వ్యక్తి తన శునకం వెంట్రుకలను కత్తిరించి.. తన హెయిర్‌స్టైల్‌ మాదిరి తీర్చిదిద్ది చూపరుల దృష్టిని ఆకర్షించారు. ఈ ఫొటోలు చూస్తుంటే ‘నీది నాది.. ఒకే హెయిర్‌ స్టైల్‌ ’అని వారు సంభాషించుకున్నట్లు కనిపిస్తోంది కదూ..! పెటెక్స్‌ ఇండియా ప్రదర్శనకు వచ్చిన ఓ వ్యక్తి తన శునకం వెంట్రుకలను కత్తిరించి.. తన హెయిర్‌స్టైల్‌ మాదిరి తీర్చిదిద్ది చూపరుల దృష్టిని ఆకర్షించారు. ఈ ఫొటోలు చూస్తుంటే ‘నీది నాది.. ఒకే హెయిర్‌ స్టైల్‌ ’అని వారు సంభాషించుకున్నట్లు కనిపిస్తోంది కదూ..!
4/20
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు.
5/20
కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సినీనటి రాశీసింగ్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సినీనటి రాశీసింగ్‌
6/20
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ వద్ద రోడ్డు కుంగి మట్టితో వెళ్తున్న టిప్పర్ అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్, ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ వద్ద రోడ్డు కుంగి మట్టితో వెళ్తున్న టిప్పర్ అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్, ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
7/20
కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆభరణాల దుకాణాన్ని సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న ‘బెదురులంక 2012’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆభరణాల దుకాణాన్ని సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న ‘బెదురులంక 2012’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
8/20
9/20
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలు, దుస్తులతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలు, దుస్తులతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
10/20
11/20
కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన అమర జవాన్లకు రాహుల్‌గాంధీ నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన అమర జవాన్లకు రాహుల్‌గాంధీ నివాళి అర్పించారు.
12/20
రథసప్తమి సందర్భంగా శ‌నివారం తిరుమలలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. వరాహస్వామివారి ఆలయ సమీపంలోని పుష్కరిణిలో స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. రథసప్తమి సందర్భంగా శ‌నివారం తిరుమలలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. వరాహస్వామివారి ఆలయ సమీపంలోని పుష్కరిణిలో స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
13/20
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
14/20
సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రైటర్‌ పద్మభూషణ్‌’. టీనా శిల్పారాజ్‌ కథానాయిక.  ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న సుహాస్‌.. కాలనీవాసులతో ఆడిపాడారు. వారికి పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రైటర్‌ పద్మభూషణ్‌’. టీనా శిల్పారాజ్‌ కథానాయిక. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న సుహాస్‌.. కాలనీవాసులతో ఆడిపాడారు. వారికి పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
15/20
ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయాధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం జవహర్‌ రెడ్డికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయాధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం జవహర్‌ రెడ్డికి తీర్థప్రసాదాలు అందజేశారు.
16/20
సినీ దర్శకుడు శైలేష్‌ కొలను డుకాటి ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన... ‘న్యూ ఇయర్‌.. న్యూ లవ్’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘సైంధవ్‌’ అనే చిత్రం తెరకెకక్కుతోంది. సినీ దర్శకుడు శైలేష్‌ కొలను డుకాటి ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన... ‘న్యూ ఇయర్‌.. న్యూ లవ్’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘సైంధవ్‌’ అనే చిత్రం తెరకెకక్కుతోంది.
17/20
రథసప్తమి సందర్భంగా విశాఖ నగరంలో జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, యోగా మాస్టర్ చిలకా రమేష్ ఆధ్వర్యంలో ‘ఓం ఉచిత యోగా సెంటర్’ ప్రారంభించారు. శనివారం ఉదయం 5.15 గంటలకు నిర్వహించిన 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి సుమారు 150 యోగాసాధకులు హాజరయ్యారు. రథసప్తమి సందర్భంగా విశాఖ నగరంలో జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, యోగా మాస్టర్ చిలకా రమేష్ ఆధ్వర్యంలో ‘ఓం ఉచిత యోగా సెంటర్’ ప్రారంభించారు. శనివారం ఉదయం 5.15 గంటలకు నిర్వహించిన 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి సుమారు 150 యోగాసాధకులు హాజరయ్యారు.
18/20
సిద్ధిపేటలోని గుండారెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచింగ్‌ లెర్నింగ్ మెటీరియల్‌ వినూత్నంగా తయారు చేశారు. టీఎల్‌ఎంలో భాగంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలుగు, ఆంగ్లం, గణిత అంశాలను అట్ట ముక్కలపై రాసి స్టాఫ్‌ రూంలో దారాలతో వేలాడదీశారు. సిద్ధిపేటలోని గుండారెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచింగ్‌ లెర్నింగ్ మెటీరియల్‌ వినూత్నంగా తయారు చేశారు. టీఎల్‌ఎంలో భాగంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలుగు, ఆంగ్లం, గణిత అంశాలను అట్ట ముక్కలపై రాసి స్టాఫ్‌ రూంలో దారాలతో వేలాడదీశారు.
19/20
కేస్లాపూర్‌ నాగోబా ఆలయం చుట్టూ భక్తులు నాణేలను గోడలకు అంటించారు. పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ దేవుడికి ముడుపు కట్టి ఇలా నాణేలను గోడలపై నిల్చొబెట్టారు. కేస్లాపూర్‌ నాగోబా ఆలయం చుట్టూ భక్తులు నాణేలను గోడలకు అంటించారు. పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ దేవుడికి ముడుపు కట్టి ఇలా నాణేలను గోడలపై నిల్చొబెట్టారు.
20/20
రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి సప్తవాహన సేవలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి సప్తవాహన సేవలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు