close

తాజా వార్తలు

Published : 24/09/2020 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీరనుకున్నంత సులభం కాదు సుమా!

యూఏఈలో ఆడటంపై రోహిత్‌

అబుదాబి: యూఏఈ వాతావరణంలో సుదీర్ఘ సమయం ఆడటం అనుకున్నంత సులభంగా ఏమీ లేదని ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌శర్మ అన్నాడు. ఆటగాళ్లందరూ దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు.

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో ముంబయి 49 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. రోహిత్‌ (80; 54 బంతుల్లో 3×4, 6×6), సూర్యకుమార్‌ యాదవ్‌(47; 28 బంతుల్లో 6×4, 1×6) ఆ జట్టు 195/5 పరుగులు చేసేందుకు పటిష్ఠ పునాది వేశారు. ఛేదనలో కార్తీక్‌ బృందం 146/9కే పరిమితమైంది. కార్తీక్‌ (30), నితీశ్‌ రాణా (24), కమిన్స్‌ (33) మినహా మరెవ్వరూ రాణించలేదు.

‘సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడటం ఇక్కడ సులభమేమీ కాదు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువసేపు ఆడాలంటే శక్తినంతా ఖర్చుచేయాల్సిందే. చివర్లో నేను అలసిపోయినట్టు అనిపించింది.  నిలదొక్కుకున్న బ్యాట్స్‌మన్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే క్రమంలో మా అందరికీ ఇదో పాఠం. గతంలోనూ ఇలాంటి పరిస్థితి అనుభవించాం. అందుకే ఎక్కువ సేపు ఆడేందుకు ప్రయత్నించా’ అని రోహిత్‌ అన్నాడు.

‘పుల్‌ షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. వాటినే సాధన చేశా. మా జట్టు ప్రదర్శన సంతోషం కలిగించింది. నా షాట్లన్నీ బాగున్నాయి. ఏదో ఒకటి బాగుందని చెప్పలేను. పిచ్‌ కొద్దిగా పేసర్లకు అనుకూలించడంతో వాంఖడే మనస్తత్వంతో బౌలింగ్‌ చేశాం. బౌల్ట్‌, ప్యాటిన్సన్‌తో కలిసి ఎక్కువగా ఆడనప్పటికీ వారెంతో అద్భుతంగా బంతులు విసిరారు. మా జట్టులో 2014లో ఇద్దరు మాత్రమే యూఏఈలో ఆడారు. ప్రణాళికలు అమలు చేసి విజయం అందుకున్నాం’ అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

రోహిత్‌ వ్యాఖ్యలతో మిగతా సభ్యులూ ఏకీభవించారు. నిజం చెప్పాలంటే అలసట వల్లే తాము ఓడిపోయామని కోల్‌కతా సారథి దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఎక్కువగా విశ్లేషణలు చేయాల్సిన అవసరం లేదన్నాడు. మెరుగ్గా ఎలా ఆడాలో కుర్రాళ్లకు తెలుసని పేర్కొన్నాడు. కమిన్స్‌, మోర్గాన్‌కు మ్యాచ్‌ రోజే  క్వారంటైన్‌ ముగిసిందని, అయినప్పటికీ బాగానే ఆడారని డీకే తెలిపాడు. న్యూజిలాండ్‌లో శీతల ప్రదేశంలో బౌలింగ్‌ సాధన చేశానని బౌల్ట్‌ అన్నాడు. అందుకే యూఏఈ ఉక్కపోతలో బంతులు విసరడం సవాల్‌గా అనిపించిందని చెప్పాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.