
ప్రధానాంశాలు
ఈనాడు, నల్గొండ: రెండో శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి అరుదైన బౌద్ధ శాసనమొకటి సమగ్ర అధ్యయనం నిమిత్తం బుధవారం మైసూరుకు చేరింది. ఇది నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిపిన తవ్వకాల్లో బయల్పడిందని జాతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఆచార్య మునిరత్నంరెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు. పాదుకల రూపంలో ఉన్న ఈ శాసనం ప్రాకృత భాష, బ్రహ్మి లిపిలో ఉందని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపగా బౌద్ధానికి చెందిన అనేక అరుదైన, పురాతన శాసనాలు బయటపడ్డాయి. వాటిలో కొన్నింటిని నాగార్జునకొండపై భద్రపరచగా మిగిలినవాటిని దిల్లీ, కోల్కతా, చెన్నైలలోని మ్యూజియాలకు తరలించారు. తాజాగా దక్షిణ భారతదేశ పురావస్తు కేంద్రమైన మైసూరుకు చేరిన ఈ శాసనాన్ని సమగ్ర అధ్యయనం చేస్తే నందికొండ ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ