Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009496
            [news_title_telugu_html] => 

నేడే ‘మహా’ నిమజ్జనోత్సవం

[news_title_telugu] => నేడే ‘మహా’ నిమజ్జనోత్సవం [news_title_english] => [news_short_description] => మహా నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
నేడే ‘మహా’ నిమజ్జనోత్సవం - EENADU
close
నేడే ‘మహా’ నిమజ్జనోత్సవం

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
దూర ప్రాంతాల వారికి పోలీసుల సూచనలు
ఈనాడు - హైదరాబాద్‌

హా నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని వివరిస్తున్నారు. ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలీ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఎవరెలా చేరుకోవాలి
* విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చేవారు ఎల్బీనగర్‌ వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మెట్రోరైలును ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
* కర్నూలు, కడప, బెంగళూరు నుంచి నగరంలోకి ప్రవేశించాలంటే బాహ్య వలయ రహదారి మీదుగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వరకు చేరుకోవచ్చు.
* బీదర్‌, మెదక్‌, సంగారెడ్డి నుంచి నగరానికి వచ్చే వారు ఊరేగింపు మార్గాలు మినహాయించి కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్‌ వరకు చేరుకోవచ్చు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దూర ప్రాంతాల నుంచి గణేశ్‌ నిమజ్జనం చూసేందుకు వచ్చేవారు ఉప్పల్‌, కూకట్‌పల్లి నుంచి మెట్రోలో ఖైరతాబాద్‌ వరకు చేరుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఖైరతాబాద్‌ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

అంబులెన్స్‌లకు మినహాయింపు

త్యవసర వైద్య సేవలు, అంబులెన్స్‌లకు ట్రాఫిక్‌ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.అత్యవసర పరిస్థితులు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు వీలుగా పోలీసులు ప్రత్యేక సహాయవాణిని ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ ఫోన్లు పనిచేస్తాయి.
040- 2785 2482
94905 98985
90102 03626
94906 16555 (వాట్సాప్‌ మాత్రమే)

శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు: డీజీపీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. అదనపు డీజీపీ జితేందర్‌తో కలిసి బుధవారం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. నిమజ్జనాలు జరిపేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 50 ప్రాంతాలను గుర్తించి, సెక్టార్లుగా విభజించి... ఒక్కో అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. దాడులకు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ఎవరైనా పుకార్లు సృష్టించి ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.