జనరల్ స్టడీస్ - భారతదేశ చరిత్ర
ప్రాంతీయ రాజ్యాలు

మొగలులు సువిశాల భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని పాలించారు. ఔరంగజేబ్ మరణించాక మొగల్ సామ్రాజ్యం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. మొగల్ చక్రవర్తుల కింద సుమారు 200 ఏళ్లుగా ఉన్న రాజకీయ ఐక్యత భగ్నమైంది. ఫలితంగా ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 18వ శతాబ్దం నాటికి ఆంగ్లేయులు భారతదేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ కాలంలో భారత్‌లోని స్వతంత్ర రాజ్యాలు, 
వాటి పాత్ర మొదలైన వాటిపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.
1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో భారతదేశ చరిత్రలో బ్రిటిష్ యుగం మొదలైందని చరిత్రకారులు పేర్కొంటారు. అయితే కొందరు మాత్రం 1761లో మూడో పానిపట్ యుద్ధంతో ప్రారంభమైందని భావిస్తారు.
18వ శతాబ్దంపై అభిప్రాయాలు
భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దాన్ని పతన, చీకటి యుగంగా పేర్కొంటారు. అయితే ఈ కాలాన్ని ఒక ముఖ్యమైన సంధి యుగంగా చరిత్రకారులు గుర్తించారు. ‘‘ఈ సమయంలోనే మొగల్ సామ్రాజ్యం పతనమై, అనేక చిన్న రాజ్యాల ఆవిర్భావానికి కారణమైంది. ఈస్టిండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది’’ అని వారు అభిప్రాయపడ్డారు.
దక్షిణ భారతదేశ రాజ్యాలు/ నాయకులు మొదలైన అంశాలతో సహా పూర్తి సమాచారం ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్ స్టడీస్ ఈ-బుక్స్’ కోర్సులో ఈ-బుక్ రూపంలో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 - 
                        
                            

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్లు.. వ్యాపారి గిఫ్ట్
 


