సేవల్లో సాంకేతికతతో పారదర్శక పాలన!

Eenadu icon
By Features Desk Published : 04 Nov 2025 00:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  

సమాచార సాంకేతికత అనువర్తనాల్లో ముఖ్యమైనవి ఈ-గవర్నెన్స్, డిజిటల్, ఆన్‌లైన్‌ సర్వీసులు. ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా అందించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. అరచేతిలోని మొబైల్‌ ఫోన్‌తోనే డిజిటల్‌ చెల్లింపులు, అనుమతులు తెచ్చుకోవడం, పత్రాలు డౌన్‌లోడ్‌ చేయడం, బ్యాంకింగ్‌ పనులు తదితరాలన్నీ   చకచకా జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఈ-గవర్నెన్స్‌ ఫలితాలు, అద్భుత విజయాలే. ప్రస్తుతం ఈ పరిణామం మరింత అభివృద్ధి చెంది యాప్‌ ఆధారిత సేవలుగా మారింది. ఆ డిజిటల్‌ విప్లవం విశేషాలపై పోటీ పరీక్షల అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. అందరికీ అందుబాటులోకి వచ్చిన యూపీఐ సేవలు, పల్లెలకూ చేరువైన బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం, పన్ను చెల్లింపుల నుంచి ప్రభుత్వ రాయితీల వరకు ఆధార్‌ సీడింగ్‌తో ఉన్న సౌలభ్యం, చదువులతో పాటు శిక్షణకూ ఉపయోగపడుతున్న ఈ-లెర్నింగ్‌ సౌకర్యం, వివిధ ఉద్దేశాలతో ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పోర్టళ్లతో పాటు డిజిటల్‌ అక్షరాస్యత విషయంలో ఉన్న సమస్యలను, సవాళ్లనూ తెలుసుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని