CBI: సీబీఐలో లా ఇంటర్న్స్‌గా చేరతారా?

Eenadu icon
By Features Desk Updated : 14 May 2025 04:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఘజియాబాద్‌లోని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అకాడమీ... 30 లా ఇంటర్న్స్‌కు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, లక్నో, బెంగళూరుల్లో అవకాశం కల్పిస్తారు. 

న్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, కోర్టు అప్లికేషన్లను రూపొందించడం, కొన్ని కేసుల విషయంలో కోర్టు తీర్పులను అధ్యయనం చేయడం, డాక్యుమెంట్లను, సాక్ష్యాలను సేకరించడం, కోర్టులో సాక్షులను విచారించడం, డేటా సేకరించడం, ట్రయల్‌ వర్క్‌.. ఇలా వివిధ రకాల విధుల విషయంలో లా అధికారులకు ఇంటర్న్స్‌ సహాయకులుగా పనిచేస్తారు. దీంతో కోర్టు కేసుల విషయంలో అవగాహన, పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం దొరుకుతుంది. ఇది కెరియర్‌లో రాణించడానికీ, లక్ష్య సాధనకూ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్న్‌షిప్‌ కాలపరిమితి మూడు నుంచి ఆరు నెలలు. 

అర్హతలు: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదువుతున్నవారు లేదా నాలుగో సెమిస్టర్‌ పూర్తిచేసినవాళ్లూ దరఖాస్తుకు అర్హులు

  • ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సు చదువుతున్నవారు లేదా ఎనిమిదో సెమిస్టర్‌ పూర్తిచేసినవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఇంటర్న్‌షిప్‌ సమయంలో సీబీఐ ఎలాంటి స్టైపెండ్‌ చెల్లించదు. వసతి, ప్రయాణ ఖర్చులను ఇంటర్న్స్‌ సొంతంగా భరించాలి. 
  • ఎటువంటి వైద్య సదుపాయాలూ ఉండవు. సీబీఐలో ఉద్యోగం సంపాదించడానికి ఈ ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించదు. 
  • ఇంటర్న్‌షిప్‌లో చేరే సమయంలో ‘ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీ’ పై సంతకం చేయాలి. శిక్షణ సమయంలో, ఆ తర్వాత కేసులకు సంబంధించిన కొన్ని విషయాలను రహస్యంగానే ఉంచాలనే నియమాన్ని పాటించడం తప్పనిసరి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.05.2025

వెబ్‌సైట్‌: https://cbi.gov.in/vacancies


Published : 14 May 2025 01:15 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు