అవన్నీ మంచి జ్ఞాపకాలే!

సాయి పల్లవి... డాన్స్‌తో అదరగొట్టే ఈ సొగసరి... త్వరలో నాగ చైతన్యతో కలిసి ‘తండేల్’తో తెరమీద సందడి చేయబోతోందనేది తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితంలోని తొలి సందర్భాలను వివరిస్తోందిలా...
ధ్యానంతో మొదలు!
నిద్రలేచాక నేను చేసే మొదటి పని నాకోసం కొంత సమయం పెట్టుకోవడం. కాసేపు యోగా, ధ్యానం చేశాకే మిగిలిన పనులు చేసుకుంటా. యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందనీ ధ్యానంతో ఒత్తిడి దరిచేరదనీ నమ్ముతాను.
ఫస్ట్ క్రష్

సూర్య... ఆయనకి వీరాభిమానిని. చిన్నప్పటినుంచీ ఆయన సినిమాలు చూస్తూనే పెరిగా. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా తనతో కలిసి నటించే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు. అలాంటిది చాలా తక్కువ సమయంలోనే సూర్యతో కలిసి ‘ఎన్‌జీకే’ చేశా. ఆ సినిమా మొదటిరోజు షూటింగ్‌లో సూర్య నా పక్కన నిల్చున్నప్పుడు ఒక్కసారి ఊపిరి ఆగినంత పనయ్యింది.
అప్పుడే టీ రుచిచూశా
ముందునుంచీ నాకు టీ అలవాటు లేదు. ‘ప్రేమమ్’ షూటింగ్ సెట్లోకి వెళ్లాక... అందరితోపాటు నాకూ టీ ఇవ్వడంతో ట్రై చేద్దామని తాగా. అలా ఇండస్ట్రీలోకి వచ్చాకే మొదటిసారి టీ తాగా.
మొదటిసారి చికెన్ చేశా
మేం మొదటినుంచీ శాకాహారులం కావడంతో మాంసాహారం గురించి వినడమే తప్ప ఎలా వండుతారో తెలియదు. అలాంటి నేను తొలిసారి ఒకరికోసం చికెన్‌ను వండాల్సి వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు దుకాణానికి వెళ్లి చికెన్‌ను తెచ్చి దాన్ని శుభ్రం చేసి మసాలాలన్నీ వేసి వండేసరికి సమయం పట్టింది. స్నేహితులు సాయం చేసినా కూడా ఆ కూర పూర్తయ్యాక అనవసరంగా ఒక ప్రాణిని చంపానని బాధపడ్డా. అయితే నేను ఎవరికోసమైతే ఆ చికెన్‌ను చేశానో వాళ్లు తిని ఆనందించారనుకోండి. చికెన్ వండటం అదే తొలిసారి, చివరిసారి కూడా.
ఫిదాను మర్చిపోలేను

తెలుగులో నేను మొదటిసారి చేసిన ‘ఫిదా’ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారి ఫిదా పోస్టర్‌ను చూసినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. షూటింగ్‌లో పాల్గొన్న మొదటిరోజే అనుకున్నా. ఆడియోలాంచ్‌లో నేను ఎలాగైనా తెలుగులో మాట్లాడాలని. నిజంగా అనుకున్నట్లుగా మాట్లాడాను కూడా. అంతేనా.. ఆ సినిమా నాకు ఫిలింఫేర్ అవార్డునూ తెచ్చిపెట్టింది. ఆ తరువాత మరో నాలుగు ఫిలింఫేర్లు వచ్చాయనుకోండి. అన్నింట్లోకి ఫిదాకు అందుకున్న అవార్డును చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ సినిమాతో నా జీవితం మలుపు
తిరిగింది మరి.
తొలి సంపాదన!
నేను తొలిసారి తీసుకున్న చెక్ ఎప్పటికీ మర్చిపోను. నా మొదటి సినిమాకు పదిలక్షల రూపాయల్ని ఇచ్చారు ‘ప్రేమమ్’ దర్శకులు.
మొదటి డాన్స్
అప్పుడు నాకు అయిదారేళ్లు. బాయ్‌కట్‌తో ఉండేదాన్ని. డాన్స్ షో కోసం పేరివ్వడం అదే మొదటిసారి. ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ఓ పాటకు డాన్స్ చేయాలనుకున్నా. ఉత్సాహంగా స్టేజ్ మీదకు వెళ్లా కానీ ఒక్కసారిగా భయం వేయడంతో వెంటనే ఏడుస్తూ కిందకు దిగిపోయా.
కస్తూరీమాన్‌తో తెరంగేట్రం

చాలామంది నేను ‘ప్రేమమ్’తోనే సినిమా రంగంలోకి వచ్చాననుకుంటారు కానీ అంతకన్నా ముందే ‘కస్తూరీ మాన్’, ‘ధామ్‌ధూమ్’ అనే సినిమాల్లో చిన్న పాత్రల్ని చేశా. ‘ధామ్‌ధూమ్’ లోనైతే.. జయంరవి, కంగనా రనౌత్ హీరోహీరోయిన్లు. ఆ షూటింగ్ సమయంలో చాలా కంగారుగా అనిపించింది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


