Google: గూగులమ్మని.. అడిగారివి
ఎప్పుడు... ఎక్కడ... ఏంటీ... ఎలా... ఇలా ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో వెతికేస్తుంటాం. మరి ఈ సంవత్సరం భారతీయులు ఎక్కువగా ఏ విషయాల గురించి ఈ సెర్చ్ ఇంజిన్‌లో శోధించారంటే...
సినిమాలు

ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల్లో ఒకటి ‘స్త్రీ2’. గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా నిలిచిన ఈ సినిమాతోపాటు ఇంకా ఏం ఉన్నాయంటే...
1.స్త్రీ2 
2.కల్కి 2898 AD
3.12th ఫెయిల్ 
4.లాపతా లేడీస్
5.హను-మాన్
6.మహారాజ
7.మంజుమ్మల్ బాయ్స్
8.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
9.సలార్
 10.ఆవేశం
వ్యక్తులు

ప్రముఖుల గురించి గూగుల్‌లో వెతికితే బోలెడు విషయాలు తెలుస్తాయి. ఒలింపిక్స్‌లో వెనుదిరిగిన వినేశ్ ఫొగాట్ ఈ ఏడాది టాప్‌లో ఉంటే... ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ఐదో స్థానంలో ఉండటం విశేషం. వీళ్లతోపాటు ఇంకా ఎవరెవరున్నారంటే...
1.వినేశ్ ఫొగాట్
2.నీతీశ్ కుమార్
3.చిరాగ్ పాశవాన్
4.హార్దిక్ పాండ్య
5.పవన్ కల్యాణ్
6.శశాంక్ సింగ్
7.పూనమ్ పాండే
8.రాధికా మర్చంట్
9.అభిషేక్ శర్మ
10.లక్ష్య సేన్
వార్తలు

ఈ సంవత్సరం గూగుల్ వార్తాంశాల్లో ఎక్కువగా చదివింది ఐపీఎల్ గురించి. అలానే రతన్ టాటా జీవిత విశేషాలనూ శోధించడం విశేషం. ఇంకా ఏం చదివారంటే...
1.ఐపీఎల్
2.టీ20 వరల్డ్ కప్
3.భారతీయ జనతా పార్టీ
4.ఎన్నికల ఫలితాలు
5.ఒలింపిక్స్
6.అధిక ఉష్ణోగ్రత
7.రతన్ టాటా
8. కాంగ్రెస్  పార్టీ
9.ప్రొ కబడ్డీ లీగ్
10.ఇండియన్ సూపర్ లీగ్
ఓటీటీ షోలు

ఓటీటీల్లో సినిమాలతోపాటు రకరకాల షోలూ, వెబ్‌సిరీస్‌లూ వినోదాన్ని పంచుతున్నాయి. మరి 2024లో ఏ ఓటీటీ షో గురించి నెటిజన్లు సెర్చ్ చేశారంటే...
1. హీరామండి
2. మీర్జాపూర్
3. ది లాస్ట్ ఆఫ్ అజ్
4. బిగ్‌బాస్ 17 (హిందీ)
5. పంచాయత్
6. క్వీన్ ఆఫ్ టియర్స్
7. మ్యారీ మై హజ్బెండ్
8. కోటా ఫ్యాక్టరీ
9. బిగ్‌బాస్ 18 (హిందీ)
10.త్రీ బాడీ ప్రాబ్లమ్
వంటకాలు

ఒకప్పుడు అమ్మ వంటలు చేయడం నేర్పితే... ఇప్పుడు ఆ బాధ్యత గూగుల్ తల్లి తీసుకుంది. ఈ సెర్చ్‌ఇంజిన్‌లో ఆహార ప్రియులు ఆరా తీసిన టాప్ టెన్ వంటకాలు ఏవంటే...
1.పోర్న్‌స్టార్ మార్టిని
2.ఆవకాయ
3.దనియా పంజిరి
4.ఉగాది పచ్చడి
5.చరణామృతం
6.ఈమా దత్షీ
7.ఫ్లాట్ వైట్
8.కంజి
9.షక్కర్ పారా
10.చమ్మంతి పొడి
అర్థాలు

కొత్త పదాలకు అర్థాలు తెలియకపోతే గూగుల్‌ని అడిగితే ఇట్టే చెప్పేస్తుంది. అలా ఈసారి రఫా నుంచి గుడ్‌ఫ్రైడే దాకా ఎన్నో పదాలకు అర్థాలు తెలుసుకున్నారు నెటిజన్లు. ఇంకా ఆ జాబితాలో ఏమున్నాయంటే...
1 ఆల్ ఐస్ ఆన్ రఫా
2.అకాయ్
3.సర్వైకల్ క్యాన్సర్
4.తవాయఫ్
5.డెమ్యూర్
6.పూకీ
7.స్టాంపీడ్
8.మోయే మోయే
9. కాన్సిక్రేషన్
10.గుడ్ ఫ్రైడే
పర్యటక ప్రాంతాలు

పర్యటక ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు ముందుగానే ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలని గూగుల్‌లో వివరాలను శోధిస్తారు. ఈ సంవత్సరం ఏ ప్రదేశాల గురించి చూశారంటే...
1.అజర్‌బైజన్
2.బాలి
3.మనాలీ
4.కజకిస్థాన్
5.జైపుర్
6.జార్జియా
7.మలేషియా
8.అయోధ్య
9.కశ్మీర్
10.సౌత్ గోవా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


