చలిచలిలో.. చంకీ లూఫర్స్‌

Eenadu icon
By Features Desk Published : 01 Nov 2025 01:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేసారి స్టైల్‌గానూ, బోల్డ్‌గానూ కనిపించాలంటే.. లూఫర్స్‌ మంచి ఎంపిక. మందపాటి బేస్‌తో మదిదోచే ఈ డిజైన్లు.. వణికించే చలిలో వేడి పుట్టించడానికి మళ్లీ రెడీ అయిపోయాయి. నిజానికి ఇవి మరీ కొత్తవేం కాదు, 90ల్లో పాపులర్‌ అయిన షూసే! ఎత్తుగా ఉన్నప్పటికీ సౌకర్యవంతంగా అనిపించడం వీటి ప్రత్యేకత. అందులోనూ చంకీ లూఫర్స్‌ ఇప్పటికే వింటర్‌ ఫ్యాషన్‌లో అటు అందంతో మెప్పిస్తూ ఇటు పాదాల సంరక్షణలో ముందుంటున్నాయి. మరి వీటిలో ఇంకా ఏమేం టైప్స్‌ అందుబాటులో ఉన్నాయో, ఎలా మెప్పిస్తున్నాయో ఓ లుక్కేద్దామా!

నిజానికి వీటిలో చాలా వెరైటీలున్నాయి. హీల్‌ ఎత్తు, లగ్‌సోల్‌ (దళసరి థ్రెడ్‌తో), ఫ్లాట్‌గా కనిపించే ప్లాట్‌ఫామ్‌.. ఇలా విభిన్నమైన ఆప్షన్లు చంకీ లూఫర్స్‌ సొంతం. ఒక్కో సందర్భానికి ఒక్కొక్కటి బాగుంటుంది.

పెన్నీ: డైమండ్‌ షేప్‌ కట్‌ఔట్‌తో ఉంటుంది. ఎక్కువగా, అడ్జస్ట్‌ చేసుకోవడానికి వీలుండే స్ట్రాప్‌తో వస్తాయి. ఎత్తు కాస్త ఎక్కువే కనిపించేలా చేస్తాయి. క్యాజువల్‌ దుస్తుల మీదకు చక్కగా నప్పుతాయి. జీన్స్‌ వేసినా, రిలాక్స్‌ ఫిట్‌ ప్యాంట్‌తో జతచేసినా బాగా కనిపిస్తాయి.

టాజిల్‌ : చూడటానికి అందమైన టాజిల్స్‌తో వస్తాయి. లూఫర్స్‌లో అమ్మాయిల మొదటి ఎంపిక ఇదే. కాజువల్, ఫార్మల్‌.. రెండు విధాలుగానూ ధరించవచ్చు. సెమీ ఫార్మల్‌ సందర్భాలకు బాగుంటాయి. సాక్స్‌ లేకుండా ధరించడం వల్ల ఫంకీ లుక్‌ తీసుకురావచ్చు.

హార్స్‌బిట్‌ : పాదం పైభాగంలో మెటల్‌ హార్స్‌బిట్‌తో అందమైన డీటెయిలింగ్‌ దీని ప్రత్యేకత. ముదురు రంగు జీన్స్‌తో కానీ, ఇతర ఫార్మల్‌ ఔట్‌ఫిట్‌తో కానీ సరిగ్గా సరిపోతాయి.

లగ్‌ సోల్‌: మామూలు దుస్తులు ధరించినా.. వాటిని మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేయడం వీటి ప్రత్యేకత. మందంగా, లోతుగా గట్టిగా ఉంటాయి. ప్రతిరోజూ వాడేందుకు సులభంగా అనిపిస్తాయి. ఫార్మల్‌ దుస్తుల్లో వీటితో కనిపిస్తే.. మెరుపు రెట్టింపు అవ్వడం ఖాయం! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు