AP News: ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1 శాతం ప్రజలు సంతృప్తి: మంత్రి పార్థసారథి

అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.7.65 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా 7.28 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై 75.1 శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని సర్వేలో తేలింది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో 50 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్బన్ ప్రాంతాల్లో వచ్చే నెల 5 వరకు అర్హుల ఎంపిక ప్రక్రియ కోసం సర్వే చేపడుతున్నాం. పట్టణాల్లో ఇళ్లు లేని పేదలు వచ్చేనెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రభుత్వంలో ఎక్కడైనా, ఏదైనా తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదు. కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు రాతలు రాస్తున్నాయి. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానం అమలుపై వైకాపా నిరసనలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని మంత్రి పార్థసారథి అన్నారు. (Andhra Pradesh News)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పంటపొలాలు ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. - 
                                    
                                        

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
నకిలీ మద్యం కేసులో నిందితుడు మనోజ్కుమార్ను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


