- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Chandrababu: ‘భగవంత్ కేసరి’కి జాతీయ అవార్డు.. చంద్రబాబు, పవన్, లోకేశ్ అభినందనలు

అమరావతి: బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం(తెలుగు) అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అవార్డు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ప్రేక్షకాదరణ పొందిన భగవంత్ కేసరి సినిమాకి జాతీయ అవార్డు రావడం సంతోషకరమైన విషయం. హీరో బాలకృష్ణ, చిత్రబృందానికి శుభాకాంక్షలు’’అని పేర్కొన్నారు.
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ‘‘సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం’’ అని పేర్కొన్నారు. ఇతర విజేతలకూ అభినందనలు తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా భగవంత్ కేసరి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలా మామయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం. మామయ్య నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా మామయ్య, డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిత్ర బృందానికి అభినందనలు’’అని పోస్టు పెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

గవర్నర్ ప్రసంగం వేళ కాగితాలు వెదజల్లిన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి: స్పీకర్
గవర్నర్ ప్రసంగానికి నినాదాలతో అడ్డుతగిలి, కాగితాలు చించి వెదజల్లిన వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని, సభా గౌరవాన్ని పెంచకపోయినా ఫర్వాలేదుకానీ, దిగజార్చే హక్కు మనకు లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -

మండలిలోనే మనకు బలం ఉంది
‘శాసనమండలిలోనే మనకు బలం ఉంది. కాబట్టి, మీరు ఇప్పుడు ఎంత గట్టిగా పనిచేస్తే మీకంత గుర్తింపు ఉంటుంది. మీ పదవులు మీకు మళ్లీ వస్తాయి. అంతకంటే మంచి పదవులూ దక్కుతాయి’ అని వైకాపా ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. -

కూటమి ప్రజాప్రతినిధులకు కుటుంబ సమేతంగా.. మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా ఇంటికి ఆహ్వానించి విందుతో గౌరవించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.. మంత్రి నారా లోకేశ్. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం రాత్రి ఆయన విందు సమావేశంలో పాల్గొన్నారు. -

లేబర్ కోడ్లు రద్దు చేసే వరకూ పోరాటం
కార్మికుల హక్కులను కాలరాసే కొత్త లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు, రైతు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టం చేశారు. -

గీతంకు భూముల క్రమబద్ధీకరణపై.. రాజకీయ రాద్ధాంతం
విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి భూముల క్రమబద్ధీకరణను రాజకీయ దురుద్దేశంతోనే వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. -

విధ్వంసం నుంచి వికాసం దిశగా..
రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూటమి ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వైకాపా పాలనలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపి, రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -

కొత్త పింఛను ఒక్కటైనా ఇచ్చారా..?: బొత్స
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చెయ్యలేదు. అర్హతగల వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పింఛనైనా ఇచ్చారా అని మండలిలో ప్రశ్నిస్తే సమాధానం లేదు’ అని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. -

ఒక్కరికీ తొలగించలేదు
సామాజిక భద్రత పింఛన్లపై మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. -

అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురువారం అసెంబ్లీ లాబీలో సందడి చేశారు. -

మండలిలో 20 వరకు బడ్జెట్‌పై చర్చ
రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై ఈ నెల 23న శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని శాసనమండలి వ్యవహారాల సలహా మండలి (బీఏసీ)లో నిర్ణయించారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, 14న బడ్జెట్ ఉంటుంది. -

అగ్రిగోల్డ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి ఊరట
అగ్రిగోల్డ్‌పై క్రిమినల్ కేసులు నమోదు కాకముందు ఆ సంస్థ వేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వారి స్థలాల్ని జప్తు నుంచి మినహాయిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం యథాతథంగా పునరుద్ధరించింది. -

గోడ నిర్మాణాన్ని అడ్డుకోని అధికారులపై హైకోర్టు ఆగ్రహం
విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ సంస్థ సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నా.. అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు ధర్మాసనం గురువారం మండిపడింది. -

ఆరోగ్యం..ఆనందం లక్ష్యంగా ‘హ్యాపీ సండే’!
ప్రజల్లో ఆరోగ్యం, ఆనందాలను పెంచే ‘హ్యాపీ సండే’ కార్యక్రమం రాష్ట్రంలో మళ్లీ ప్రారంభం కానుంది. ప్రతి నెలా రెండు, నాలుగో ఆదివారాల్లో అన్ని నగరాలు, పట్టణాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -

ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్
బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.c -

రాష్ట్రానికి పరిశ్రమలు రావడం.. వైకాపాకు ఇష్టం లేదు
విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించే అంశం మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లకు దారితీసింది. భూముల కేటాయింపు వెనుక లాలూచీ ఏంటో చెప్పాలని వైకాపా ఆరోపించింది. -

బొత్స వర్సెస్ మంత్రి పార్థసారథి
గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను వైకాపా సభ్యులు ప్రస్తావిస్తున్నారని మంత్రి కె.పార్థసారథి శాసనమండలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -

మద్యంలో రూ. 3,200 కోట్లు.. చిన్న అవినీతి కాదు
‘‘బ్యూరోక్రాట్లు, రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనుభవించేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు.. వీరందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం, కుమ్మక్కు లేకుండా రూ.3,200 కోట్ల భారీ అవినీతి సాధ్యం కాద]ు. ఇదేమీ చిన్నది కాదు. -

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి ప్రమాణం
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ఆయనతో ప్రమాణం చేయించారు. -

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -

వైకాపా హయాంలో ఆయుష్ శాఖ నిర్వీర్యం
వైకాపా హయాంలో ఆయుష్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రాలేదన్నారు.











