Cm chandrababu: అమరావతిలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అరుదైన ఖనిజాల వెలికితీతకు విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం
పారిశ్రామికవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్‌లో పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాంకేతిక రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించారు. ఏపీలో ఉన్న అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా అతితక్కువ ఖర్చుతో సరకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని వివరించారు. ‘లాజిస్టిక్‌ కారిడార్‌ ద్వారా ఏపీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏఐ వినియోగం, నిపుణుల తయారీ వంటి అంశాలతో పాటు ఎకోసిస్టం అభివృద్ధికి ఉన్న     అవకాశాలను పరిశీలించండి. అరుదైన భూగర్భ   ఖనిజాల వెలికితీతకు వివిధ విశ్వవిద్యాలయాలు కూడా భాగస్వాములు కావాలి. వీటిని వెలికి   తీయడం ద్వారా ప్రపంచ అవసరాలకు వాటిని వినియోగించవచ్చు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఆరుప్‌ గ్లోబల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కెన్నీ, డిజిటల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అల్తెరిన్‌ టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్‌ కంపెనీ సీఈవో పూనమ్‌గుప్తా, డబ్ల్యూఎంజీ యూనివర్సిటీ నుంచి గౌరవ్‌ మార్వాహా, నానోసైన్స్‌ ఫ్రొఫెసర్‌ రాధాబోయా, ఏఐ పాలసీ ల్యాబ్స్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ నాగరాజు, ఫ్లుయెంట్‌ గ్రిడ్‌ ప్రెసిడెంట్‌ రత్న గారపాటి, బ్రిటిష్‌ హెల్త్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రతినిధి పాల్‌ బెంటన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు