Fake Liquor Case: విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్ అనుచరుల హంగామా

విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేశ్ అనుచరులు, వైకాపా కార్యకర్తలు హంగామా సృష్టించారు. జోగిని అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేశారు. ఆసుపత్రి క్యాజువాల్టీ వార్డు అద్దాలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో పోలీసులకు, జోగి రమేశ్ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
ఇవాళ ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతోపాటు సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. తనకు రూ.3 కోట్ల సాయం చేస్తానని రమేశ్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పంటపొలాలు ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. - 
                                    
                                        

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
నకిలీ మద్యం కేసులో నిందితుడు మనోజ్‌కుమార్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 


