NEET: నీట్ రాసిన తల్లీకుమార్తె

ప్రశ్నపత్రాలతో కుమార్తె కావేరి, తల్లి సరిత
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: నీట్ పరీక్షకు ఓ విద్యార్థినితో పాటు ఆమె తల్లి కూడా హాజరవ్వడం విశేషం. వీరిద్దరూ ఆదివారం వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత(38) ప్రస్తుతం ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. 2007లో బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరంలో ఉండగా వివాహం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు జన్మించడంతో కోర్సు పూర్తి చేయలేకపోయారు. ఈమె భర్త భూక్యా కిషన్ కూడా ఆర్‌ఎంపీగా చేస్తున్నారు. వీరిద్దరూ తమ కుమార్తెను ఎంబీబీఎస్ చదివించి డాక్టర్‌ను చేయాలనుకున్నారు. ఖమ్మంలో కుమార్తె నీట్ శిక్షణ పొందుతున్న సమయంలో తల్లికి కూడా పరీక్ష రాయాలనే ఆకాంక్ష కలిగింది. దీంతో ఆమె కూడా పరీక్షకు సన్నద్ధమయ్యారు. తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో.., కుమార్తె కావేరి.. ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్‌ఎస్‌పీ క్యాంపు కేంద్రంలో పరీక్ష రాశారు.
72 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం

ఆమెకు 72 ఏళ్లు. ఈ వయసులో నీట్ రాశారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న వాళ్లు ఆమె ఉత్సాహాన్ని ఆసక్తిగా తిలకించారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి నీట్ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం వచ్చారు. చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు.
ఈనాడు, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


