విద్యావేత్త గుర్రంకొండ ఎం.నాయుడు ఇకలేరు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Aug 2025 06:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ విద్యావేత్త, దాత, దార్శనికుడు ప్రొఫెసర్‌ గుర్రంకొండ ఎం.నాయుడు ఇకలేరు. ఆయన అమెరికాలో ఈ నెల 28న కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఆయన 1937 ఏప్రిల్‌లో గుర్రంకొండ వెంకట స్వామినాయుడు, లక్ష్మమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు విద్యారంగంలో విశేషంగా సేవలు అందించారు. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌- వైట్‌వాటర్‌లో ప్రొఫెసర్‌ (మార్కెటింగ్‌) ఎమిరటస్‌గా పనిచేశారు. ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతిలో 1983లో యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌ సహకారంతో ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కో-ఛైర్మన్‌గా, జీవీ నాయుడు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. విస్‌కాన్సిన్‌లో జీఎం నాయుడు స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. విస్‌కాన్సిన్‌- మ్యాడిసన్‌లో ఎన్నో మార్కెటింగ్, స్టాటిస్టిక్స్‌ సంఘాల్లో  క్రియాశీలక సభ్యుడిగా ఆయన ఎంతో మందికి సుపరిచితుడు. తన ఉద్యోగ ప్రస్థానంలో 75కు పైగా పరిశోధనా పత్రాలు, వ్యాసాలు రాశారు. పూతలపట్టు మండలం కొత్తపల్లె గ్రామంలో సూక్ష్మరుణ సదుపాయాలు కల్పించటం, ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయటంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారు.

Tags :
Published : 30 Aug 2025 06:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు