నిరంతరాయంగా టెలికాం సేవలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా టెలికాం సేవలకు ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం తెలిపారు. సేవల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే స్పందించడానికి విజయవాడలో 24×7 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 0866- 2424242, 94901 79300 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.


సగం బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ

తుపాను నేపథ్యంలో మంగళవారం ఏపీఎస్‌ఆర్టీసీ సగం బస్సులను నిలిపేసింది. ఉదయం చాలాచోట్ల జల్లులు మాత్రమే పడటంతో రోజూ మాదిరిగానే బస్సులు నడపాలని భావించారు. అయితే ప్రభుత్వం తుపాను ప్రభావంపై పెద్దఎత్తున ప్రచారం చేయడం, అవసరమైతేనే ప్రయాణాలు చేయండని సూచించడంతో.. బస్టాండ్లు, బస్టాపుల్లో ప్రయాణికులు పల్చగా కనిపించారు. దీంతో కొన్ని బస్సులనే నడిపారు.


నేటి నుంచి యథావిధిగా విమానాల రాకపోకలు

విశాఖపట్నం విమానాశ్రయంలో రద్దయిన అన్ని విమానాలు బుధవారం నుంచి షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు. విశాఖ-విజయవాడ ఇండిగో విమానం మాత్రం బుధవారం రద్దయిందని, ప్రయాణికులు గమనించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు