గిరిజన ప్రాంతాల్లో గోవిందుడి ఆలయాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Oct 2025 07:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రూ.750 కోట్లతో ఐదు వేల నిర్మాణాలకు తితిదే నిర్ణయం
దేవాదాయశాఖకు రూ.175 కోట్లు బదిలీ
తితిదే, దేవాదాయ శాఖల పర్యవేక్షణకు వీలుగా పోర్టల్‌

ఈటీవీ-తిరుపతి; న్యూస్‌టుడే, తిరుమల: శ్రీ వేెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్‌ నిధులతో ఐదు వేల ఆలయాలను నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో గిరిజన తండాలు గోవింద నామస్మరణలతో మార్మోగనున్నాయి. తితిదే పర్యవేక్షణలో దేవాదాయశాఖ ద్వారా రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో రాష్ట్రంలో ఐదు వేల గోవిందుడి ఆలయాలు నిర్మించాలని తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు అరికట్టడం.. హిందూ ధర్మ పరిరక్షణ, వ్యాప్తి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. తితిదే పర్యవేక్షణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు చేసేందుకు నిధుల కొరత లేకుండా శ్రీవాణి ట్రస్ట్‌ నుంచి రూ.175 కోట్లు దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించారు.

పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ..: వైకాపా హయాంలో శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు దారిమళ్లాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు వీలుగా దేవాదాయశాఖ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణం ప్రారంభించాక వివిధ దశల్లో చిత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా నిబంధనలు రూపొందించారు. 

మూడు రకాల ఆలయాలు

గిరిజన ప్రాంతాల్లో గ్రామాల జనాభా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మూడు రకాల ఆలయాలను నిర్మించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇందుకు రూ.పది లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల్లో ఒక్కో ఆలయానికి రూ.5 లక్షలు మాత్రమే కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచింది.

Tags :
Published : 30 Oct 2025 07:42 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు