బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
కర్నూలులో బీసీ భవన నిర్మాణానికి ఎంపీలాడ్స్ నుంచి రూ.కోటి కేటాయింపు: ఆర్.కృష్ణయ్య

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో అసంపూర్తిగా ఉన్న బీసీ భవనం నిర్మాణానికి తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరతామన్నారు. ఈ బిల్లు ప్రధాని మోదీ వల్లే సాధ్యం అవుతుందన్నారు. జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ వృత్తుల వారికి రాయితీ రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్ ఛైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


