జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్‌ మంత్రి రవీంద్ర

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Nov 2025 04:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భోగాపురంలో మహిళా రైతులతో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర. చిత్రంలో ఎమ్మెల్యే రాజు

చోడవరం, న్యూస్‌టుడే: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని భోగాపురం, రాయపురాజుపేట గ్రామాల్లో ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజుతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మహిళా రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నకిలీ మద్యం కేసులో అనుమానాలు సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయాలని జరుగుతున్న కుట్ర బహిర్గతమైంది. జనార్దన్‌రావు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు రమేష్‌ కలిసినట్లు పక్కా సమాచారం ఉంది. ఇదంతా చేసేందుకు రూ.3 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించినట్లు విచారణలో తేలింది’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు