ఓఎంసీ గనుల్లో డ్రోన్‌ సర్వే ప్రారంభం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డ్రోన్‌తో సర్వే చేపడుతున్న అధికారులు

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు కోసం సోమవారం అధికారులు డ్రోన్‌తో సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులు గల్లంతయ్యాయి. ఇప్పటికే పలు దఫాలుగా సర్వే చేసినప్పటికీ కొలిక్కి రాకపోవడంతో గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వారం రోజులుగా సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓఎంసీ, అంతర గంగమ్మ మైనింగ్‌ ప్రాంతాల్లో విజయవాడ సర్వే ఆఫ్‌   ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్లు సూర్యరావు,  జయరాజ్‌ ఆధ్వర్యంలో బృందం సర్వే చేపట్టింది. సోమవారం అంతర గంగమ్మ కొండలో ఉన్న  ఓఎంసీ లీజు ప్రాంతంలో 68.5 హెక్టార్లకు డ్రోన్‌ సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 5 లీజుల గనులకు సంబంధించిన సర్వే చేయనున్నట్లు వివరించారు. వారి వెంట రేంజ్‌ అధికారి రామచంద్రుడు, డీఆర్‌వో దామోదర్‌రెడ్డి, మండల సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు