మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా?
మంత్రి లోకేశ్ సవాల్
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమేయం 
అన్ని ఆధారాలు దొరికినందునే అరెస్ట్
తప్పు చేసినవాళ్లను బీసీ, ఓసీ అని వదిలేస్తామా అని వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: ‘మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై గానీ దేవుడిపై గానీ ప్రమాణం చేయగలరా’ అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించే విషయంలో కుల, మతం, ప్రాంతాలు, పార్టీలు చూడం. నకిలీ మద్యం కేసులో తెదేపా వారిని సైతం అరెస్టు చేశాం. ఈ కేసులో అన్ని ఆధారాలతో దొరికినందునే జోగి రమేష్ అరెస్టయ్యారు. కాల్ డేటా కూడా లభించింది. తప్పు చేసిన వ్యక్తిని బీసీ, ఓసీ అని వదిలేస్తామా? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రజలకు దగ్గర చేయాలని 94 ఏళ్ల పండా ఆలయాన్ని నిర్మించారు. అక్కడ తొక్కిసలాట దుర్ఘటనలో పండాను అరెస్టు చేసి, చేతులు దులిపేసుకోవచ్చు. కానీ, అలా చేయలేదు. మానవత్వంతో పని చేస్తున్నాం’ అని తెలిపారు.
పార్టీ కార్యాలయంపై దాడిని మర్చిపోలేదు
‘వైకాపా హయాంలో కర్రలతో తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. దాన్ని మేం మర్చిపోలేదు. వైకాపా పాలనలో మంత్రి నారాయణస్వామి శాసనసభలో ప్రతిపక్షనేత చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. మెంటల్ ఆసుపత్రికి పంపించాలని అప్పటి మంత్రి సీ‡దిరి అప్పలరాజు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మేం ఎప్పుడూ ఎవర్నీ ఒక్కమాట కూడా తూలనాడలేదు.
- జగన్ అసెంబ్లీ వేదికగా చర్చిద్దామంటే రావడం లేదు. వైకాపాకు 11 సీట్లు వచ్చాయి.. అయినా తనను సీఎంను చేస్తేనే శాసనసభకు వస్తానని జగన్ అంటే ఎలా?
 - చనిపోయిన తెదేపా కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడ్డుపడ్డారు. బీసీలకు న్యాయం చేస్తామంటే అడ్డుకున్నారు.
 
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
- కులం, మతం, ప్రాంతం ముసుగులో కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నేను అనని మాటలు అన్నట్లు వక్రీకరించేవారు తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారు.
 - కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన జరిగితే పక్క జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ కనీసం పరామర్శకు రాలేదు. పైగా వైకాపా వారు ఆ ఘటనపై ఫేక్ వీడియో వదిలారు.
 - అరాచక పాలన చేసిన వైకాపాను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేయడంతో పెట్టుబడిదారుల్లోనూ నమ్మకం ఏర్పడింది.
 - పీపీఏల రద్దుతో రూ.10వేల కోట్ల అప్పు మనపై పడింది. రద్దుచేసి జగన్ ఏం సాధించారు? అప్పట్లో ఎలా సీఎం అయ్యారో గానీ జగన్‌కు ఏ సబ్జెక్టూ తెలియదు.
 - మా మంత్రుల్లో ఎవరికీ ఇగోస్ లేవు. మంత్రి రామానాయుడు నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా.
 - తుపాను నష్టాలపై కేంద్రానికి నివేదిక పంపాం.
 - తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నేతలు అంతర్గతంగా విమర్శలు చేసుకున్నా బయటకు వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పని చేస్తారు. మన రాష్ట్రంలో ఆ సంస్కృతి లేదు’ అని అన్నారు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


