Minister nara lokesh: భాగస్వామ్య సదస్సులో ₹ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల హాజరు
410 ఒప్పందాలపై సంతకాలు 
2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమిపూజ
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్

విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై సమీక్షిస్తున్న మంత్రి లోకేశ్. చిత్రంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్
ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని.. వీటి ద్వారా రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. సదస్సు సందర్భంగా రూ.2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమిపూజ చేయబోతున్నామని ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై లోకేశ్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌లతో కలిసి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘కూటమి పాలనలో రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయ పెట్టుబడుల్లోనే కాకుండా ఎఫ్‌డీఐల్లోనూ ఏపీ నంబర్ వన్‌గా నిలుస్తోంది. రాబోయే పదేళ్లలో పారిశ్రామిక రంగంలో రానున్న మార్పులు, అందులో భారత్, ఏపీ పాత్ర ఏమిటి తదితర అనేక అంశాలపై విశాఖ సదస్సులో చర్చలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలప్పుడు చెప్పాం. ఆ హామీ నెరవేర్చేందుకు మంత్రులందరం మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాం.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే..
ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామికవేత్తలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఏపీ అగ్రపథాన పయనిస్తుంది. నిన్న ముంబయిలో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లినప్పుడూ పలువురు పారిశ్రామికవేత్తలను కలిశాను. సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వం, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల కంపెనీలు తమ పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంటున్నాయి. పక్క రాష్ట్రాలు పోటీపడి ప్రోత్సాహకాలిస్తున్నా ఏపీ వైపు మొగ్గుచూపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలే కారణం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సమన్వయం వల్లే గూగుల్ లాంటి భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. కేంద్రం అనుమతించడంతో ఆర్సెలార్ మిత్తల్ సంస్థ రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం. ఏపీలో ఆరు గిగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు, అందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఎకో సిస్టమ్‌ను తీసుకురావాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశోధనలకు ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ వర్సిటీ, క్రీడాభివృద్ధికి గ్రిఫిత్ వర్సిటీ, సోలార్ సెల్, క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ఇతర ఆస్ట్రేలియా వర్సిటీలతో మాట్లాడుతున్నాం. ఈ నెలలో చాలా కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి.
ఏఐతో అభ్యర్థుల సామర్థ్యం మదింపు
త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం. ఈ పోర్టల్‌లో బైక్ మెకానిక్ నుంచి క్వాంటమ్ ఇంజినీర్ వరకు ఏఐ సాంకేతికతతో అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేస్తాం. పరిశ్రమలతో నిరుద్యోగుల జాబితా అనుసంధానం చేస్తాం.
ఒక్క రాత్రిలోనే అద్భుతాలు జరగవు
రాష్ట్రం కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దాం. ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వాళ్లకు తెలిసిన కంపెనీలను తీసుకొచ్చినా క్రెడిట్ వారికే ఇస్తాం. ఒకే ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగినచోట రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్క రాత్రిలోనే అద్భుతాలు జరగవు. ఐదేళ్ల వైకాపాలో అరాచక పాలన చూశాం. ఇప్పుడు పెట్టుబడులులాంటి పాజిటివ్ వార్తలు చూస్తున్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమీక్షిస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని మేం అడగడం వల్లే కేంద్రం రూ.13 వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. దీన్ని మరింత సమర్థంగా నిర్వహించాలి. ఏపీ ప్రభుత్వం సైతం కర్మాగారంలో వాటాదారు’ అని లోకేశ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


