పాలే లేని.. పాపాల నెయ్యి
అక్షరాలా 60 లక్షల కిలోల సరఫరా
2019-24 మధ్య దానితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూల తయారీ
వైకాపా పాలనలో కుంభకోణం
రూ.235 కోట్లు దుర్వినియోగం
డెయిరీలతో చేతులు కలిపిన తితిదే ఇంటిదొంగలు
వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న డెయిరీల ప్రతినిధులతో బేరసారాలు
హవాలా మార్గాల్లో లంచాల స్వీకరణ
తేల్చిచెప్పిన సిట్
600 పేజీలతో తుది అభియోగపత్రం దాఖలు

ఈనాడు - అమరావతి, తిరుపతి; న్యూస్‌టుడే- తిరుపతి (నేర విభాగం): వైకాపా హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. పాలే లేకుండా పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్‌తో సిద్ధం చేసిన పదార్థాన్నే నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటాకెరోటిన్ లాంటి రసాయనాలను కలిపారని తేల్చింది. ఇలా ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారుచేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో రూ.235 కోట్ల తితిదే నిధుల దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది. కొంతమంది తితిదే ఉద్యోగులు, అధికారులు, డెయిరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది అభియోగపత్రం (ఛార్జ్‌షీట్) దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగపత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో తితిదే ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డెయిరీ సంస్థల ప్రతినిధులున్నారు.
కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్
తితిదే అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కె.చిన్న అప్పన్న డెయిరీ సంస్థల ప్రతినిధులతో బేరసారాలు జరిపి, హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారంటూ ఆ లావాదేవీల్ని సిట్ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో రూ.4.69 కోట్లు జమ కాగా అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేసి అందుకున్నట్లు అభియోగాలున్నాయి. సిట్ ఈ వివరాలన్నీ అభియోగపత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ, భోలేబాబా తదితర సంస్థలతో పాటు వాటి ప్రతినిధులు కల్తీ నెయ్యి సరఫరాలో ఎలా భాగస్వాములయ్యారో సిట్ ఛార్జ్‌షీట్‌లోఅభియోగపత్రంలో వివరించింది.
టెండర్ల నిబంధనల సడలింపుతో కల్తీకి రాచబాట
తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు కఠిన నిబంధనలు ఉండేవి. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనల్ని పూర్తిగా సడలించేశారు. టెండర్లలో పాల్గొనే డెయిరీ పాలు సేకరించాల్సిన పనిలేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డెయిరీ మూడేళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, రూ.250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, రూ.150 కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసింది. వైవీ సుబ్బారెడ్డి తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశమిచ్చినట్లయ్యిందని సిట్ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు తెలిసింది.
సుబ్బారెడ్డి, భూమన, చెవిరెడ్డిల విచారణ
ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి తితిదే ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలతో పాటు తితిదే అప్పటి ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తితిదే పాలకమండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలనూ ప్రశ్నించారు. ఆ విచారణ అంశాలనూ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు తెలిసింది.
14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు
- సిట్ అధికారులు మొత్తం 14 నెలలపాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గతేడాది మే నెలలో తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. నవంబరు 23న కోర్టుకు సమర్పించిన మెమోలో తితిదే ఉద్యోగులు, డెయిరీ నిపుణులు కలిపి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ 36 మంది నిందితుల ప్రమేయంపైనా తాజా అభియోగపత్రంలో స్పష్టంగా వివరించారు.
- తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భోలేబాబా ఓరోగానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఉన్నారని తేలింది. వీరు దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌ల నుంచి రసాయనాలు తెప్పించి, ఉత్తరాఖండ్‌లోనే కల్తీ నెయ్యి తయారుచేసి పంపారని విచారణలో వెల్లడైంది. అనంతరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిందితులను గుర్తించారు.
- ఈ కేసులో తొలుత గతేడాది ఫిబ్రవరి 9న ఏఆర్ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్, పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్‌కాంత్ చావ్డాలను.. అనంతరం అజయ్‌కుమార్ సుగంధ్, ఆశిష్ అగర్వాల్, హరిమోహన్‌రాణాలను అరెస్ట్ చేశారు.
- కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్, వైష్ణవి, మాల్‌గంగ, భోలేబాబా డెయిరీలకు రూ.251 కోట్లు తితిదే సొమ్మును చెల్లించారు. ఈ వివరాలన్నీ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఆ కాలం వేరు.. కట్టడాలు వేరు!
బ్రిటిషర్ల కాలంలో కట్టడాలు ఎంత దృఢంగా నిర్మించారనడానికి ఉదాహరణే ఈ రైల్వే వంతెన. -

త్వరలో ఆన్లైన్లో శ్రీవారి డాలర్లు
శ్రీవారి భక్తుల కోసం వారు ఎంతో పవిత్రంగా భావించే బంగారు, వెండి డాలర్లను దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆన్లైన్లో అందించేందుకు తితిదే సమాయత్తమవుతోంది. -

కట్టెల పొయ్యిపై వంట
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్‌పై తీవ్ర ప్రభావం పడింది. మార్కెట్లో వాణిజ్య సిలిండర్లు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -

కొబ్బరికి గండం.. పోర్టుల్లో నిలిచిపోయిన కొబ్బరికాయల కంటెయినర్లు
గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం దేశంలోని కొబ్బరి మార్కెట్‌పై పడింది. కొబ్బరి సాగుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక పెట్టింది పేరు. -

నిజాయతీ చాటుకున్న ఆటోడ్రైవర్.. రూ.30లక్షల విలువైన ఆభరణాల బ్యాగు అప్పగింత
తన ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్నారో ఆటోడ్రైవర్. -

రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
రాష్ట్రాన్ని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని, ఇందుకు బీచ్‌శాండ్ వంటి ఖనిజాలను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -

దళిత నేతను తొలిసారి స్పీకర్ చేసిన ఘనత తెదేపాదే
దళిత నేతను తొలిసారి స్పీకర్ పీఠంపై కూర్చోబెట్టిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. -

పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఏపీలో అనుకూల వాతావరణం
పర్యాటక రంగంలో దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -

పాఠశాలల అభివృద్ధికి అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్టు చేయూత
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్టు ముందుకు వచ్చింది. -

‘జన్ సున్వాయ్’తో మహిళా సమస్యల పరిష్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మహిళా ‘జన్ సున్వాయ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. -

నేత్రపర్వంగా ఖాద్రీశుడి రథోత్సవం
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. -

అర్ధంతరంగా ఆగిన జీవిత ‘నడక’
తోటి సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పరుగు పందెంలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఇది. -

రాష్ట్రమంతటా జనసేన ఆవిర్భావ వేడుకలు
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నగరాలు, పంచాయతీల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. -

50 ఏళ్లుగా పోరాడుతున్నారు.. అలసిపోలేదా?
భాజపా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. -

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలి
సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడి జంతర్ మంతర్‌లో టీచర్లు ధర్నా నిర్వహించారు. -

రెండు దశల్లో జనగణన
జనగణనలో భాగంగా ప్రతి కుటుంబ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలు నమోదు చేయనున్నట్లు సెన్సస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. -

అరటి రైతు పరిస్థితీ అంతే!
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని అరటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. యుద్ధం నేపథ్యంలో ఎగుమతి లేక అరటి పంటకు డిమాండ్ తగ్గింది. -

వట్టి వేరే కాదు..!
వట్టి వేళ్లు అంటే కేవలం వేసవిలో చల్లదనం కోసం తెరలు ఏర్పాటు చేసుకోవడానికే కాదని.. వాటితో అనేక ఉత్పత్తులను ఆకర్షణీయంగా, దృఢంగా చేయవచ్చని పలువురు ముందుకు వస్తున్నారు. -

జేఈఎస్‌టీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో సైన్స్, కంప్యూటింగ్‌లో అత్యాధునిక పరిశోధన విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తూ ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జేఈఎస్‌టీ)కు తిరుపతి ఐసర్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. -

86 పుర, నగరపాలికల్లో ప్రత్యేక అధికారుల నియామకం
రాష్ట్రంలో 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, 11 నగరపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది.







