Cyclone Montha: తుపాను తీరం దాటే సమయంలో గంటన్నరపాటు ప్రభావం: వాతావరణ కేంద్రం

అమరావతి: ‘మొంథా’ తీవ్ర తుపాను కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదల సూచన ఉందన్నారు. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు మూడ్రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. కాకినాడలో పదో నెంబరు, విశాఖ, గంగవరంలో తొమ్మిదో నెంబరు, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నంలో 8వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి లోగా ‘మొంథా’ తీవ్ర తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కాకినాడ తీరానికి 190కి.మీ దూరంలో ఉందన్నారు. తీరం దాటినప్పుడు గంటన్నరపాటు ప్రభావం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ బులిటెన్లు ఇస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పంటపొలాలు ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. - 
                                    
                                        

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
నకిలీ మద్యం కేసులో నిందితుడు మనోజ్కుమార్ను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


