‘ప్రత్యేక హోదా’పై కేంద్రానికి హైకోర్టు నోటీసులు: నేరుగా వాదనలు విన్పించిన కేఏ పాల్

Eenadu icon
By Ap Top News News Desk Updated : 11 Sep 2024 07:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, ఆర్థిక శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్‌ ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో కలిపి ఏ బెంచ్‌ విచారించాలో నిర్ణయించేందుకు ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు పిటిషనర్‌ పాల్‌ నేరుగా వాదనలు వినిపిస్తూ ‘రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదు. ఏపీ ఆర్థికంగా పునరుజ్జీవం పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, సహకారం అవసరం. ఏపీ గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నార’ని కోర్టు దృష్టికి తెచ్చారు.

Tags :
Published : 11 Sep 2024 07:11 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు