UP: రీల్స్ మోజులో మైనర్లు.. ఐ ఫోన్ కోసం దారుణ హత్య

లఖ్‌నవూ: సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్ల కోసం యువత ఎటువంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్లు ఐఫోన్ (iPhone)లో రీల్స్ (reels) చిత్రీకరిస్తే ఎక్కువ లైక్‌లు వస్తాయనే ఆలోచనతో.. ఐఫోన్ కోసం ఓ యువకుడి గొంతు కోసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన షాదాబ్ (19) అనే యువకుడు తన మేనమామ వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని నాగౌర్ గ్రామానికి వచ్చాడు. జూన్ 21 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చేపట్టిన పోలీసులు గ్రామం వెలుపల శిథిలావస్థలో ఉన్న బావిలో అతడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతుడి మెడపై కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అతడి ఫోన్ లొకేషన్ ఆధారంగా గ్రామంలోని 14, 16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఐఫోన్‌లో రీల్స్ చేయడం వల్ల వీడియోలు హై క్వాలిటీతో వస్తాయనే ఆలోచనతో ఐఫోన్ కోసం అతడిని హత్య చేసినట్లు బాలురు అంగీకరించారు. ఘటన జరిగిన రోజున వారు రీల్స్ చేద్దామని చెప్పి షాదాబ్‌ను ఊరి చివర ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు కోసి, బండ రాయితో తలపై మోది హత్య చేసినట్లు పేర్కొన్నారు. హత్య అనంతరం ఆయుధాలను దాచడానికి సహకరించిన మరో బాలుడిని కూడా అరెస్టు చేసి, వారిని గోండా ప్రాంతంలోని డివిజనల్ జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 


