డ్రగ్స్‌తో పట్టుబడిన వైకాపా విద్యార్థి సంఘం నేత

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: విశాఖలో వైకాపా విద్యార్థి విభాగం నేత డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారంతో విశాఖలోని టాస్క్‌ఫోర్స్, నాలుగో పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడులు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌కు సమీప శ్రీనివాస కల్యాణ మండపం వద్ద ఐదుగురు వ్యక్తులు ఎల్.ఎస్.డి. స్ట్రిప్స్ నగరానికి తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టి వారినుంచి 48 స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ సీఐ భాస్కరరావు తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్న వారిలో వైకాపా విద్యార్థి విభాగం నేత మద్దిలపాలేనికి చెందిన కొండారెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు విజయవాడకు చెందిన చరణ్, శ్రీకాకుళానికి చెందిన హర్షవర్ధన్, శరత్‌లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి సంతానం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు నుంచి వాటిని విశాఖ తరలించినట్లు గుర్తించారు. పట్టుబడిన వారిని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్‌లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

రాజస్థాన్‌లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్‌కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


