నకిలీ మద్యం కేసులో మరో నలుగురు నిందితులు

Eenadu icon
By Crime News Desk Published : 04 Nov 2025 06:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది. వీరిని విచారించి, అరెస్టు చేసేందుకు ఎక్సైజ్, సిట్‌ అధికారులు చర్యలు చేపట్టారు. అద్దేపల్లి జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావులకు వీరు పలురకాలుగా సాయం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. 

  • విజయవాడకు చెందిన వ్యాపారి మనోజ్‌కుమార్‌ను ఏ20గా చేర్చారు. ఆయన జనార్దన్‌రావుకు మూతలు, సీసాలు సరఫరా చేశారు. నిందితుడికి ఎక్సైజ్‌ పోలీసులు 41ఏ నోటీసిచ్చి సోమవారం పిలిపించారు. విచారణ మధ్యలో ఉండగా తనకు అస్వస్థతగా ఉందని చెప్పడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
  • గోవా నుంచి స్పిరిట్‌ తెచ్చి సరఫరా చేసిన బాలాజీ కుమారుడు సుదర్శన్‌ను ఏ21గా చేర్చారు.  
  • కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌తో కొన్ని రకాల సీసాలు తయారు చేయించుకున్నారు. దీంతో అతడిని ఏ22గా చేర్చారు. 
  • హైదరాబాద్‌కు చెందిన దారబోయిన ప్రసాద్‌ను ఏ23గా చేర్చారు. ఆయన సీసాల మూతలపై బ్రాండ్‌ పేరు వచ్చేలా ముద్రించి, ఇబ్రహీంపట్నానికి చేర్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు