Bapatla: భార్య ఉసురు తీసి.. మృతదేహంతో స్టేషన్‌కు

Eenadu icon
By Crime News Desk Published : 15 Dec 2025 06:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం

నిందితుడు అల్లడి వెంకటేశ్వర్లు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త.. ఆమె శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరంలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు, రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (28)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేష్‌ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహాలక్ష్మి ప్రవర్తనపై భర్తకు అనుమానం రావటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో మహాలక్ష్మి రెండు నెలలుగా భర్తకు దూరంగా మాచవరంలోని పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరం వచ్చాడు. పాపకు బంగారం తెచ్చానని, ఇంటికి వెళదామని.. మాట్లాడాలంటూ నమ్మబలికాడు.

భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచవరం నుంచి విప్పర్ల వెళ్లే మార్గం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మహాలక్ష్మి ధరించిన స్వెట్టర్‌కు ఉన్న తాడును ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ద్విచక్ర వాహనం పెట్రోలు ట్యాంకుపై ఉంచి.. బైక్‌ నడుపుతూ తీసుకెళ్లి సంతమాగులూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మహాలక్ష్మి ప్రాణంతో ఉందేమోనని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆ సమాచారాన్ని రొంపిచర్ల పోలీస్‌ స్టేషన్‌కు చేరవేశారు. వారు సంతమాగులూరు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలి గొంతుపై గాయాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని