Crime News: రోడ్డు పక్కన నిల్చున్నా.. దూసుకొచ్చిన మృత్యువు
దంపతుల మృతి.. ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు

బీబీనగర్, న్యూస్‌టుడే: ఫోన్ రావడంతో రోడ్డు పక్కన ఆగిన దంపతులను.. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు ప్రశాంత్(32), భార్య ప్రసూన(28)తో కలిసి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఫోన్ రావడంతో జాతీయ రహదారి 163పై బీబీనగర్ పెద్దచెరువు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి మాట్లాడుతున్నారు. అదే మార్గంలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు కారులో వెళ్తున్న ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ దంపతులను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ప్రశాంత్.. పక్కనున్న చెరువులోకి ఎగిరిపడి ప్రసూన అక్కడికక్కడే మృతిచెందారు.
దంపతులను ఢీకొట్టిన అనంతరం వాహనం ఎగిరి సర్వీసు రోడ్డుపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన తంగళ్లపల్లి షణ్ముఖ్(20), చైతన్యపురికి చెందిన దోర్నాల భార్గవ్(18), పద్మానగర్‌కు చెందిన కొండా సాయిరిత్(18)గా గుర్తించారు. వరంగల్ వాసులైన వీరు హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో యాదగిరిగుట్టకు వెళ్లేందుకు ఎల్బీనగర్ సమీపంలో థార్ వాహనాన్ని అద్దెకు తీసుకొని బయలుదేరారు. వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇందులో సాయిరిత్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్‌లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

రాజస్థాన్‌లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్‌కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


