logo

Crime news: రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన సంఘటన గుడిహత్నూర్ మండలం సీతాగొంది సమీపంలో చేసుకుంది.

Published : 28 May 2024 15:19 IST

ఎదులాపురం: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన సంఘటన గుడిహత్నూర్ మండలం సీతాగొంది సమీపంలో చేసుకుంది. బెంగళూరు నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న ఐచర్ వాహనం.. ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వ్యాన్ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. ఐచర్ వ్యాన్‌లో ఉన్న డ్రైవర్లు అజయ్, దినేష్ అందులో ఇరుక్కుపోయారు. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ స్థానికుల సాయంతో దాదాపు గంటసేపు శ్రమించి వారిని బయటకు తీశారు. అనంతరం రిమ్స్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని