logo

Ts news: 31న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు.

Published : 28 May 2024 15:29 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 31న ఉదయం 8 గంటలకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, పి.రాజేష్ తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రూ.50 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అండర్-8, 10, 12, 14, 16,18, 20  వయసు విభాగంలో బాల, బాలికలకు, మహిళలు, పురుషులకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జూన్ 6, 7 తేదీల్లో హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని