logo

Adilabad: అసత్య వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తప్పవు

అసత్య వార్తలు ప్రసారం చేసినా, ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హెచ్చరించారు.

Published : 28 May 2024 19:33 IST

ఎదులాపురం: అసత్య వార్తలు ప్రసారం చేసినా, ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హెచ్చరించారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేశారని కొన్ని మాధ్యమాల్లో వార్తలు వెలవడ్డ నేపథ్యంలో ఆయన వివరణ ఇస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కేవలం బందోబస్తు ఏర్పాటు చేశారని, రైతులెవరిపై లాఠీచార్జి చేయలేదన్నారు. విత్తనాలను కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో వచ్చిన రైతులు దుకాణాల్లోకి దూసుకెల్లకుండా క్రమబద్ధీకరిస్తూ వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రైతులతో పోలీసులు వాగ్వాదం చేసుకోవటం గాని తోపులాట ఘటన సైతం జరగలేదన్నారు. తప్పుడు వార్తలు ఇచ్చి రైతులకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని