logo

స్పందించారు.. చేతిపంపు బిగించారు..!

మండలంలోని ఓలా ప్రాథమిక పాఠశాల ప్రాంత కాలనీలో బోరుకు మోటారు బిగించారు. ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌ లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. బోరు చుట్టూ నాచు పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది.

Published : 14 Apr 2024 02:48 IST

ఓలాలో బోరుకు చేతిపంపు ఏర్పాటు చేయిస్తున్న పంచాయతీ కార్యదర్శి యోగేష్‌, కారోబారి శంకర్‌  

కుంటాల, న్యూస్‌టుడే: మండలంలోని ఓలా ప్రాథమిక పాఠశాల ప్రాంత కాలనీలో బోరుకు మోటారు బిగించారు. ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌ లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. బోరు చుట్టూ నాచు పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది. ఈ సమస్యపై శనివారం ‘ఈనాడు’లో ‘నీరు వృథా.. పరిసరాలు అపరిశ్రుభం’ శీర్షికన చిత్ర కథనం ప్రచురితమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి యోగేష్‌, కారోబారి కూస శంకర్‌ బోరు బావిలోని సింగల్‌ ఫేజ్‌ మోటారును తొలగించారు. దానికి చేతిపంపు బిగించారు. నీటి పొదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకుంటూ వృథా నివారణ చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని