logo

సైనికుల్లా కష్టపడి ఎంపీగా గెలిపించుకుందాం

నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌ పేర్కొన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

Updated : 14 Apr 2024 06:29 IST

కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌

నేరడిగొండ, న్యూస్‌టుడే : నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌ పేర్కొన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. మండల కన్వీనర్‌ ఆడె వసంత్‌రావు, బోథ్‌ బ్లాక్‌ అధ్యక్షుడు ప్రపుల్‌చందర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర మాజీ కన్వీనర్‌ అనుపట్ల సంజీవ్‌ కుమార్‌, నాయకులు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, పోతారెడ్డి, కపిల్‌, నాయిడి రవి, నర్సింగ్‌, కర్తార్‌ ఉన్నారు.

బోథ్‌: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌ అన్నారు. బోథ్‌లోని షాదీఖానాలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బూత్‌ లెవల్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి బూత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యాన్ని తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ స్టిక్కర్లను అందజేశారు. ఏఎంసీ ఛైర్మన్‌ గంగారెడ్డి, నాయకులు పోతన్న, షేక్‌ నాజర్‌, అనిల్‌, పోతరెడ్డి, సాయన్న, రమేష్‌, వంశీ, నారాయణ, మహమ్మద్‌, ఇస్రు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన నాయకులతో శ్రీనివాసరెడ్డి

ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మాజీ సర్పంచులు కినక జుగాదిరావు, కార్యదర్శి గోడం నాగోరావులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం కడెం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బొజ్జు వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ముకాడే ఉత్తం, సీనియర్‌ నాయకుడు మెస్రం నాగ్‌నాథ్‌లు పాల్గొన్నారు.

కినక జుగాదిరావు ఈ నెల 8న భారాసకు రాజీనామా చేసి భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ల సమక్షంలో భాజపాలో చేరారు. ఆయనతో పాటు గోడం నాగోరావు సైతం కాంగ్రెస్‌ పార్టీని వదిలి భాజపాలో చేరినట్లు భాజపా నాయకులు ప్రకటించారు. భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ తన బంధువు అని కలిసేందుకు వెళితే భాజపా నాయకులు ఆ పార్టీ కండువాను వేశారని నాగోరావు అన్నారు.

ఎమ్మెల్యే బొజ్జు సమక్షంలో పార్టీలో చేరుతున్న మాజీ సర్పంచులు నాగోరావు, జుగాదిరావు

ఆదిలాబాద్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీలో 35వ వార్డు కౌన్సిలర్‌ ఫౌజియా బేగం భర్త జాఫర్‌ అహ్మద్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పలువురు ఎంఐఎం కార్యకర్తలు, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని అంకోలి, తంతోలి, కచ్‌కంటి, జైనథ్‌ మండలంలోని సాంగ్వి, కరంజి గ్రామాల నుంచి పలువురు పార్టీలో చేరగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. డీసీసీబీ ఛైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, బాలూరి గోవర్ధన్‌రెడ్డి, దిగంబర్‌రావు పాటిల్‌, వెంకట్‌రెడ్డి, కొండ గంగాధర్‌, గుడిపెల్లి నగేష్‌, మంచికట్ల ఆశమ్మ, గంగారెడ్డి, ఆనంద్‌, సాయిప్రణయ్‌, లక్ష్మణ్‌, ఎంఏ షకీల్‌, చందు, శ్రీలేఖ తదితరులున్నారు.

ఆదిలాబాద్‌ అర్బన్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజాసేవాభవన్‌లో పార్టీ ప్రచార ప్రతులను ఆవిష్కరించారు. పార్టీ ఎన్నికల ప్రణాళిక కరపత్రాలను, స్టిక్కర్లను ప్రతి ఇంటికి అందజేయాలన్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసి రానున్న నెలరోజులు ప్రజాక్షేత్రంలోనే ఉండాలన్నారు. పార్టీ నాయకులు గుడిపెల్లి నగేష్‌, వెంకట్‌రెడ్డి, గిమ్మ సంతోష్‌, గంగారెడ్డి, కొండూరి రవి, సుధాకర్‌గౌడ్‌, రాజ్‌ మహ్మద్‌, ఖయ్యుం, రఫీక్‌, రాంరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు