logo

అనుమతి లేకుండా దవాఖానాల్లో అన్నదానం నిషేధం

ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధంగా కొనసాగుతున్న జీజీహెచ్‌, ఎంసీహెచ్‌లో అన్నదానాలు, అల్పాహారాలు అనుమతి లేకుండా పంపిణీ చేయడం పూర్తిగా నిషేధమని జీజీహెచ్‌ ఆర్‌ఎంఓ భీష్మ తెలిపారు.

Published : 14 Apr 2024 03:12 IST

డా.భీష్మ, జీజీహెచ్‌ ఆర్‌ఎంఓ

మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధంగా కొనసాగుతున్న జీజీహెచ్‌, ఎంసీహెచ్‌లో అన్నదానాలు, అల్పాహారాలు అనుమతి లేకుండా పంపిణీ చేయడం పూర్తిగా నిషేధమని జీజీహెచ్‌ ఆర్‌ఎంఓ భీష్మ తెలిపారు. దాతలు సమయం, సందర్భం లేకుండా ఆసుపత్రికి వచ్చి ఇష్టారీతిన వ్యవహరించడం తగదన్నారు. గతంలో దాతలు అందించిన ఆహారం వికటించి ఇక్కడి బాధితులు, వారి బంధువులు అస్వస్థతకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని ప్రభుత్వమే అందజేస్తోందని తెలిపారు. బయటి నుంచి ఎవరూ అందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో కేవలం పండ్ల పంపిణీకి తప్ప అన్నదానాలు, అల్పాహారాలు పంపిణీ చేసేందుకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ఇలాంటి వాటితో చికిత్స పొందుతున్న బాధితులకు ఆహారం వికటిస్తే మరింత ప్రమాదకర పరిస్థితి ఉంటుందన్నారు. దాతలు సహకరించి ఆసుపత్రిలో ఆహారాన్ని అందించే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని