logo

గంజాయి తరలిస్తున్న అయిదుగురి అరెస్టు

గంజాయిని తరలిస్తున్న అయిదుగురిని అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్‌ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

Published : 14 Apr 2024 03:45 IST

వివరాలు వెల్లడిస్తున్న ఉట్నూరు డీఎస్పీ నాగేందర్‌

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : గంజాయిని తరలిస్తున్న అయిదుగురిని అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్‌ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం ముత్నూరు సమీపంలో 510 గ్రాముల గంజాయి తరలిస్తున్న దూంపేట రాకేశ్‌, ముద్దం రాంచరణ్‌లను పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన వీరిద్దరికి ముత్నూరుకు చెందిన మెస్రం శేఖర్‌, అసోడాకు చెందిన కుంర రాంజీ, బొప్పపూర్‌కు చెందిన మెస్రం రవీందర్‌ గంజాయి సరఫరా చేసినట్లుగా తెలపడంతో ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నామని.. తోయగూడకు చెందిన మరో వ్యక్తి జుగ్నాక భీంరావు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీఐ మొగిలి, ఉట్నూరు, ఇంద్రవెల్లి ఎస్సైలు మనోహర్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని