logo

సీఎం పర్యటన.. బందోబస్తుకు 800 మంది పోలీసులు

సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు.

Updated : 21 Apr 2024 18:48 IST

ఎదులాపురం: సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. సుమారు 800 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు నియమించామన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభాస్థలిని ఆదివారం డీఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో అమలు చేసే ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు. బాబు జగ్జీవన్ రామ్ చౌక్, కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. రిమ్స్ నుంచి బస్టాండ్ వరకు ఒక మార్గంలో వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు