logo

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోడ్సం భీమ్రావు సూచించారు.

Published : 22 May 2024 13:06 IST

ఎదులాపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోడ్సం భీమ్రావు సూచించారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో  సీపీఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేటి రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల వైఫల్యాలు, పార్టీ విధానాలపై, ఉద్యమాల కార్యాచరణపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పార్టీ నేతలు బండి దత్తాత్రి, లంకా రాఘవులు, మంజుల, ఆశన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని