logo

Adilabad: కౌంటింగ్ ఏర్పాట్లపై సిబ్బందికి శిక్షణ

జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా మంగళవారం కలెక్టరేట్‌లో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Published : 28 May 2024 19:27 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా మంగళవారం కలెక్టరేట్‌లో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజర్షి షా లెక్కింపు ఎలా చేపట్టాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని, ఆరు గంటలకే సిబ్బంది కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అసెంబ్లీ స్థానాల వారీగా పోలైన ఓట్లు, పోలింగ్‌ కేంద్రాల ఆధారంగా రౌండ్లు ఉంటాయని వివరించారు. ఓట్ల లెక్కింపు రోజు విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు పాలనాధికారి శ్యామలదేవి, ఆర్డీవో వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు